Piyush Goyal And Chandrababu
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Chandrababu: కేంద్రమంత్రి గోయల్‌కు చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్.. వర్కవుట్ అయ్యేనా?

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) మధ్య జరిగిన భేటీలో కీలక చర్చ జరిగింది. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్.. ముఖ్యమంత్రితో సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు.. క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపు, మ్యాంగో పల్ప్‌పై (Mango Pulp) జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఆయా అంశాలపై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను.. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అలాగే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు ఈ అంశాల్లో కేంద్ర సహకారాన్ని కోరారు.

Read Also- Perni Nani: పేర్ని నాని కొంపముంచిన అత్యాశ.. అందుకే ఈ పరిస్థితి..!

రూ.150 కోట్లు ఇవ్వండి..
ప్రస్తుత సీజన్‌లో హెచ్డీ బర్లీ, వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు ధరలు తగ్గిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు (CM Chandrababu) వివరించారు. పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలను ప్రారంభించిందని తెలిపారు. దీంట్లో భాగంగా రూ.300 కోట్ల వ్యయంతో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం వెల్లడించారు. ఈ మేరకు బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 కొనుగోలు కేంద్రాలను ఏపీ మార్క్ ఫెడ్ (AP Markfed) ద్వారా ఏర్పాటు చేసినట్టు వివరించారు. కోనుగోళ్ల కోసం రూ.150 కోట్లను టొబాకో బోర్డు ద్వారా వ్యయం చేసేలా చూడాలన్నారు. ప్రస్తుతం ఏపీలో 1.31 లక్షల హెక్టార్లల్లో పొగాకు సాగు చేశారని గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగిందని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్ తగ్గడంతో ధరల విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్‌ను టొబాకో బోర్డు పరిధిలోకి తెచ్చేలా చట్టాన్ని సవరించాలని సీఎం కోరారు.

Chandrababu

పునరాలోచన చేయండి..
క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని కేంద్రమంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంతో పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని వివరించారు. క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకం విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని కోరారు. సుంకం తగ్గింపుతో కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలను చేరుకోలేమన్న విషయాన్ని గమనించాలని చంద్రబాబు సూచించారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల వల్ల ఏపీలోని 8 లక్షల ఆక్వా రైతులు నష్టపోతున్నారని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధించిన 27 శాతం సుంకాన్ని తగ్గించేలా ఆ దేశ అధికారులతో మాట్లాడాలని కోరారు. ఆక్వా రైతులపై ఈ టారిఫ్ భారం తగ్గించి సంక్షోభం నుంచి బయటపడేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. అమెరికా విధించిన సుంకాల వల్ల ఆక్వా రైతులు, హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి దారులు సంక్షోభంలో పడ్డారని ముఖ్యమంత్రి వివరించారు.

Piyush Goyal

మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని తగ్గించండి..
మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను చంద్రబాబు కోరారు. మామిడి తాండ్రపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, అదే తరహాలో మ్యాంగో పల్ప్‌కు కూడా వర్తింపచేయాలని సూచించారు. జీఎస్టీ తగ్గిస్తే మామిడి రైతులకు, పల్ప్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినట్టు పీయూష్ గోయల్‌కు వివరించారు. చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని పొగాకు, పామాయిల్, మామిడి రైతులకు మేలు కలిగేలా చర్యలు చేపడతామని అన్నారు. భేటీ అనంతరం కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి.. జ్ఞాపికను అందజేశారు. సారొచ్చారు.. సీఎం వివరించారు.. కేంద్ర మంత్రి విన్నారు సరే ఇవన్నీ ఎప్పుడు ఆచరణలోకి వస్తాయి..? ఎంతవరకూ వర్కవుట్ అవుతాయని రాష్ట్రంలోని రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also- Mohan Babu: ‘కన్నప్ప’తో ‘తుడరుమ్’ కలెక్షన్స్‌ బ్రేక్ అవ్వాలి! మోహన్ లాల్ ఫ్యాన్స్‌‌కు రిక్వెస్ట్!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?