Kannappa Trailer Launch
ఎంటర్‌టైన్మెంట్

Mohan Babu: ‘కన్నప్ప’తో ‘తుడరుమ్’ కలెక్షన్స్‌ బ్రేక్ అవ్వాలి! మోహన్ లాల్ ఫ్యాన్స్‌‌కు రిక్వెస్ట్!

Mohan Babu: మోహన్ లాల్ ఫ్యాన్స్‌కు రిక్వెస్ట్.. ‘తుడరుమ్’ కలెక్షన్స్‌ని ‘కన్నప్ప’ బ్రేక్ చేయాలని అన్నారు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu). తన కుమారుడు మంచు విష్ణు హీరోగా, మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). జూన్ 27న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం కోచిలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాలెట్టన్ మోహన్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..

Also Read- Thalliki Vandanam: తల్లికి వందనం నిజంగానే సూపర్ సక్సెస్ అయ్యిందా?

మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. మోహన్‌ లాల్ నాకు సోదరుడి వంటి వారు. మోహన్‌ లాల‌్‌తో ప్రియదర్శిన్ రూపొందించిన ‘చిత్రం’ మూవీని తెలుగులో నేను ‘అల్లుడు గారు’ పేరుతో రీమేక్ చేశాను. అలా జీరో నుంచి మళ్లీ స్టార్ హీరోగా మారాను. అప్పటి నుంచి మా స్నేహ బంధం మొదలైంది. ఇంకా చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సోదరుడు ఏమాత్రం మారలేదు. శారీరకంగా, మానసికంగా అలానే ఉన్నారు. స్వచ్ఛమైన ఆలోచనలు, హృదయం ఉన్నవారు మాత్రమే ఇలా ఉండగలుగుతారు. మోహన్‌ లాల్ గొప్ప నటులు. ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కూడా.. ఎప్పుతూ తన వెంట ఒక మేకప్‌మ్యాన్ మాత్రమే వస్తారు. మా అందరి కంటే సెట్‌లోకి ముందు వచ్చేది తనే. ఈ మూవీ కోసం ఇంత వరకు తను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. తనతో నటించే అవకాశం నా బిడ్డ విష్ణుకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇన్నేళ్ల కెరీర్‌లో తనతో కలిసి ఎప్పుడూ నటించలేకపోయాను. ఇప్పుడైనా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని తనని అడుగుతున్నాను. జూన్ 27న మా ‘కన్నప్ప’ చిత్రం వస్తోంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి మా యూనిట్‌ను ఆశీర్వదించండి. ‘తుడరుమ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇవ్వాలని మోహన్‌ లాల్ అభిమానులను కోరుతున్నానని అన్నారు.

Also Read- Fathers Day 2025: ఫాదర్స్ డే స్పెషల్‌గా సెలబ్రిటీలు.. వారి పిల్లలు చేసిన పోస్ట్‌లివే!

మోహన్‌లాల్ (Mohanlal) మాట్లాడుతూ.. ఇప్పుడంతా అంతా పాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తోంది. భాషా హద్దుల్లేకుండా సినిమాలను తీస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అన్ని భాషల నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి చేసిన సినిమా ‘కన్నప్ప’. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మోహన్ బాబు, విష్ణులకి థాంక్స్. శివుడుకి ‘కన్నప్ప’ గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడి కథను చాలా గొప్పగా ఇందులో చూపించారు. న్యూజిలాండ్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. మోహన్ బాబు ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. ఆ శివుడి అనుగ్రహం ఈ సినిమాపై ఉండాలని కోరుకుంటున్నాను. జూన్ 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అని తెలిపారు. ‘కన్నప్ప’ కోసం మంచు విష్ణు చాలా కష్టపడ్డారని, ఈ సినిమాలో నటించినందుకు, మోహన్ బాబుతో కలిసి పని చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు ముఖేష్ రిషి. ‘మోహన్ బాబు సినిమా అంటే మా సినిమా. ఇది మా సొంత చిత్రమనే అనుకుంటున్నాం. ఈ మూవీని అందరూ ప్రేమించి సక్సెస్ చేస్తారు’ అని అన్నారు ఆశీర్వాద్ అధినేత ఆంటోని పెరంబవూర్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు