Kannappa Trailer Launch
ఎంటర్‌టైన్మెంట్

Mohanlal: కాల్చి చంపేస్తా.. అంటూ మోహన్ బాబుకు మోహన్ లాల్ వార్నింగ్!

Mohanlal: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)ను కాల్చి చంపేస్తా.. అంటూ లాలెట్టన్ మోహన్ లాల్ వార్నింగ్ ఇచ్చారు. అదీ కూడా ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో.. అవును.. ఇది నిజమే. మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. శనివారం కోచిలో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి.. ‘కన్నప్ప’లో ఓ కీలక పాత్రలో నటించిన మోహన్ లాల్ ముఖ్య అతిథిగా హాజరై.. టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం మోహన్ బాబు, మోహన్ లాల్‌ మధ్య ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. ఈ సంభాషణలో మోహన్ బాబును కాల్చి చంపేస్తా అంటూ మోహన్ లాల్ అనడంతో అంతా ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమిటంటే..

Also Read- Salman Khan Marriage: నేను పెళ్లి చేసుకుంటా.. రిజెక్ట్ చేసిన అమ్మాయిని మర్చిపోలేను.. సల్మాన్ ఖాన్ కామెంట్స్

ఇంతకు ముందు ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూర్‌లో జరిగిన కార్యక్రమంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవగా.. ఆ వేదికపై కూడా మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. నీ సినిమాలో విలన్‌గా చేయాలని ఉందని మోహన్ బాబు డైరెక్ట్‌గా అడగడంతో.. శివరాజ్ కుమార్ నవ్వుతూ, మీరు చేస్తానంటే విలన్‌గా కాదు.. మీకు సరిపడా పాత్రని తప్పకుండా సెట్ చేస్తానని మాటిచ్చారు. సేమ్ టు సేమ్ అదే సంభాషణ కోచిలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కూడా జరిగింది. మీరు నటించే సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది? అంటూ మోహన్ లాల్‌ని మోహన్ బాబు అడిగారు. దీనికి మోహన్ లాల్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

ఇప్పటి వరకు నేను చూసిన స్వీట్ పర్సన్స్‌లో మీరూ కూడా ఒకరు. మీరు ఇప్పటికే 600కి పైగా సినిమాలు చేశారు. మీరే హీరోగా చేయండి.. అందులో విలన్‌గా చేసే భాగ్యం నాకు కల్పించండి.. అని మోహన్ లాల్ సమాధానమివ్వంగా.. నో నో.. అలా అనవద్దు. మీ సినిమాలో విలన్‌గా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దయచేసి ఆ అవకాశం నాకు ఇవ్వండి అని మోహన్ బాబు మళ్లీ అడిగారు. దీనికి మోహన్ లాల్.. ‘విలన్‌గానే ఎందుకు చేయాలని అనుకుంటున్నారు.. అంటూ స్టేజ్ కింద కూర్చుని ఉన్న ఆంటోని పెరంబవూరుని.. ఇది సాధ్యమవుతుందా? అని అడిగారు. ఆయన ఓకే అని చెప్పారు. అయితే మీరు విలన్‌గా చేస్తే.. మొదటి సీన్‌లోనే మిమ్మిల్ని కాల్చి చంపేస్తా.. అని మోహన్ లాల్ అనగానే అందరూ నవ్వేశారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Venu Swamy : మరో బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి.. భారీ ప్రమాదాలు జరుగుతాయంటూ..?

దీనికి నెటిజన్లు కొందరు.. ‘మోహన్ బాబుకి ఎన్ని కష్టాలు వచ్చాయో? సినిమా ప్రమోషన్స్‌కి వెళ్లినట్లు లేదు.. తనకు అవకాశాలు ఇవ్వండి బాబు.. అని అడగడానికి వెళ్లినట్లుగా ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘మంచు ఫ్యామిలీకి హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఇప్పుడున్న డబ్బంతా కన్నప్పకే పెట్టారు. ఆ సినిమా రిజల్ట్ కనుక ఏమైనా తేడా కొడితే, ఉపయోగపడుతుందని ముందు జాగ్రత్తగా ఇలా అందరినీ లైన్‌లో పెడుతున్నారు..’ అంటూ జోక్స్ పేలుస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..