Venu Swamy: వేణుస్వామి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్ల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ఒక స్టార్ హీరోకు ఎంత క్రేజ్ ఉంటుందో అంత పేరును సంపాదించుకుని వేణుస్వామి నిత్యం ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటారు. ఏపీ , తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ విషయంలో ఆయన చెప్పింది నిజం కాలేదు. అప్పటి నుంచి ఈయన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
చాలామంది హీరోయిన్లకు పూజలు చేసి వారికి విజయాలు వచ్చేలా చేశాడు. గతంలో వేణుస్వామి రాజకీయ నాయకుల జాతకాలు చెప్పడంతో అవి నిజం కాకపోవడంతో అన్ని అబద్దాలు చెబుతున్నడంటూ చాలామంది అన్నారు. కానీ వేణుస్వామి చెప్పిన వాటిలో కొన్ని జరగలేదేమో కానీ, కొన్ని మాత్రం జరిగాయి. 2025లో జరిగే సంఘటనలు గురించి కూడా ఈయన ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరిగాయి. ఆయన ఎలా చెప్పాడో అలాగే జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి కూడా అందరి కంటే ముందుగా చెప్పాడు.
ఆ ఘోర విమాన ప్రమాదంలో 230 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో సహా 242 మంది మరణించారు. ఈ ప్రమాదం గురించి జ్యోతిష్యుడు వేణు స్వామి ముందుగానే చెప్పిన వీడియో ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. 2025 ఉగాది సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఏడాది విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతాయని , అలాగే సినీ ప్రముఖులు కూడా మరణిస్తారని ముందే సంచలన కామెంట్స్ చేశాడు.