Solar Power Plants (imagecredit:twitter)
తెలంగాణ

Solar Power Plants: రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు.. ప్రతి జిల్లాకు రెండు

Solar Power Plants: రాష్ట్రంలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. దసరా నాటికి ప్లాంట్లు కంప్లీట్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. తొలుత ప్రతి జిల్లాలకు 2 పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ప్లాంట్ ను 4 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో ప్లాంట్ 0.5 మెగావాట్ల ఉత్పత్తికి 1.50కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. 25ఏళ్ల అగ్రిమెంట్ సైతం చేసుకున్నారు. ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ ప్లాంట్లు మరింత దోహదపడనున్నాయి.

మహిళా స్వయం సహాయక సంఘాలు

మహిళలను ఆర్థికంగా, సామాజికంగాను ముందడుగు వేసేలా పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్​హెచ్​జీ​)ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. విద్యుత్తు రంగంలో మహిళలు అడుగుపెట్టడంతోపాటు వారి సత్తాను చాటి చెప్పనున్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను పెండింగ్‌ లేకుండా చెల్లించడం, ప్రభుత్వపరంగా అందించే ప్రోత్సాహంతో పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో రాణిస్తుండటంతో ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయి.

Also Read: HYDRAA Plan: హైడ్రా మాన్సూన్ యాక్షన్ ప్లాన్

దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్​) ద్వారా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు వారికి సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించింది. గ్రామంలోని స్వయం సహాయక సంఘాల సమన్వయంతో పనిచేసే గ్రామ సమాఖ్యకు ఒక మెగావాట్‌ సామర్థ్యం ఉన్న సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిప్లాంటును అప్పగించబోతున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల సాధికారత, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఆర్థికాభివృద్ధితోపాటు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్​ ఎనర్జీ విప్లవానికి నాంది పలికింది.

ప్రతీ జిల్లాకు 2 సోలార్​ ప్లాంట్లు

రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో తొలుత రెండు చొప్పున సోలార్ విద్యుత్  ప్లాంట్లను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించింది. ఈ దసరా నాటికి ప్లాంట్లను ప్రారంభించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో ఏర్పాటు చేస్తుంది. ప్రతీ జిల్లాకు రెండు చొప్పున మొత్తం 64 సోలార్ ప్లాంట్లను తొలి విడుతగా ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ సోలార్ ప్లాంట్ 0.5 మెగావాట్ల (500 కిలోవాట్ల) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సోలార్ ప్లాంట్ స్థాపనకు సుమారు రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. 64 ప్లాంట్లకు మొత్తం రూ.96 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేసింది.

ప్లాంట్ల ఏర్పాటు కోసం అవసరమైన నిధుల కోసం నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)కు ది రూరల్ ఇన్ఫ్రాసక్ట్రక్షర్ డెవలప్ మెంట్ ఫండ్(ఆర్ఐడీఎఫ్) దరఖాస్తు చేశారు. నాబార్డు  675 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. 5శాతం వడ్డీతో రుణ సదుపాయం కల్పించాయి. అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సబ్సిడీలు, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సమకూర్చనున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్ లు విజయవంతం అయితే మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Baba Vanga: అత్యంత భయానకంగా 2025.. ఆ రోజే మానవ జాతి అంతం.. బాబా వంగా జోస్యం

భూసేకరణ బాధ్యతలు కలెక్టర్లకు..

సోలార్ ప్లాంట్ల స్థాపనకు అవసరమైన భూమిని సేకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఒక్కో 0.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌కు 4 ఎకరాల భూమి అవసరం ఉంది. ప్రతి జిల్లాలో1 మెగావాట్ సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలో 64 ప్లాంట్లకు మొత్తం 256 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.  విద్యుత్తు సబ్​ స్టేషన్లు, విద్యుత్ గ్రిడ్‌కు సమీపంలో స్థలాలు అనుకూలంగా ఉంటాయని ఆ దిశగా భూములు సేకరిస్తున్నారు.  బీడు భూములు లేదా ప్రభుత్వ భూములకు ప్రాధాన్యమిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో  భూసేకరణ పూర్తి అయ్యింది. మరికొన్ని జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. జూన్​ నెలలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశాలు సైతం అందాయి. అంతేకాకుండా, అవినీతి, అక్రమాలను నివారించేందుకు జియో-ట్యాగింగ్, డిజిటల్ రికార్డింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. భూములకు సంబంధించి మరోసారి నిర్ధారించుకోవాలని, ఆ భూముల అప్పగింతకు సిద్ధంగా ఉండాలని కలెకర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

7 కంపెనీలతో ఒప్పందాలు..

31 జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల స్థాపన కోసం 7 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  25 సంవత్సరాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) చేసుకున్నాయి. వెండర్స వీటి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను చూసుకుంటారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖకు నిర్ణీత ధరకు అమ్ముతారు. 25 సంవత్సరాల తర్వాత ప్లాంట్ల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా స్థానిక మహిళా సంఘాలకు బదిలీ అవుతుంది. పారదర్శకమైన టెండర్ ప్రక్రియ ద్వారా అర్హత కలిగిన సోలార్ టెక్నాలజీ కంపెనీలను ఎంపిక చేశారు. ఈ కంపెనీలు అధునాతన సోలార్ ప్యానెళ్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను సరఫరా చేస్తాయి. తొలుత రాష్ట్రంలో 62 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. జునా సోలార్​ సిస్టమ్​ లిమిటెడ్​ కంపెనీ మహుబూబ్​నగర్​, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్​ జిల్లాల్లో 10 మెగావాట్లు సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నది.

Also Read: Israel-Iran Conflicts: ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం.. ట్రంప్

ఆదిలాబాద్​, నిర్మల్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల 8 మెగావాట్లు, కరీంనగర్​, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల 8 మెగావాట్లు విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఏడాదికి(వార్షిక) రూ.85.93 కోట్లు టర్నోవర్​ కానున్నది. డైనిరీ ఇంజినీరింగ్​ ప్రైవేట్​ లిమిటేడ్ కంపెనీ వరంగల్​, మహుబూబాబాద్​, ములుగు, హన్మకొండ, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో 10 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా రూ.48.64 కోట్లు టర్నవర్​ అవుతుందని అంచనా వేశారు. ప్రొటెన్షన్​ ఎనర్జీ సిస్టమ్​ లిమిటెడ్​ కంపెనీ మెదక్​, సిద్ధపేట, సంగారెడ్డి, జనగాం జిల్లాల్లో సోలార్​ విద్యుత్తు ప్లాంట్ల ద్వారా 8 మెగావాట్ల ఉత్పత్తి కానున్నది. రూ.20.46 కోట్లు టర్నవర్​ కానున్నది.

రూ.24.57 కోట్లు టర్నవర్

ఏ & టీ పవర్​ సిస్టమ్​ కంపెనీ రంగారెడ్డి, వికరాబాద్​ జిల్లాల్లో  ప్లాంట్లు ద్వారా 4 మెగావాట్లు  విద్యుత్తు కానున్నది. 13.73 కోట్లు, కైన్​ ప్రాజెక్టు, ఇండస్ట్రిస్​ కంపెనీ సూర్యాపేట, నల్లొండ జిల్లాల్లో ప్లాంట్ల ద్వారా  4 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కానున్నది. రూ.24.57 కోట్లు టర్నవర్​, సాయిబాజాజ్​ ప్రాజెక్టు ప్రైవేట్​ లిమిటెడ్​ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాల్లో 8 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా  రూ.12.93 కోట్లు టవర్నర్​ కానున్నది. వామనసోలార్​ ఈపీసీ కంపెనీ యాద్రాద్రి భువనగిరి జిల్లాలో 2 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా రూ.5.18 కోట్లు టర్నోవర్​ కానున్నది

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు