Congress Plans( image credit: twitter)
Politics

Congress Plans: లోకల్ కంటే ముందే.. కార్పొరేషన్ చైర్మన్లు!

Congress Plans: స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) లోపే కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేయాలని కాంగ్రెస్ (Congress) భావిస్తున్నది. ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్లకు త్వరలోనే చైర్మన్లను కేటాయించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు పార్టీ కసరత్తు చేస్తున్నది. జిల్లాల వారీగా వివరాలు ఇవ్వాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ డీసీసీలకు సూచించారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్ట పడుతున్న వారికే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని వివరించారు. గతంలో ఓ సారి గాంధీభవన్‌కు చేరిన లిస్టును కూడా ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) స్క్రీనింగ్ చేస్తున్నట్లు తెలిసింది.

మంత్రి వర్గ విస్తరణలో సంపూర్ణంగా సామాజిక న్యాయం లభించిందని భావిస్తున్న మీనాక్షి, (Meenakshi Natarajan) కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలోనూ క్యాస్ట్ ఈక్వేషన్స్ తప్పనిసరిగా పాటిస్తామని నొక్కి చెప్పారు. పైరవీలకు ఎలాంటి ఛాన్స్ లేదంటూ ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ‘క్షేత్రస్థాయిలోని కొందరు నేతలు పదవులు కోసం పెద్ద నాయకులతో సిఫారసులు చేయించుకుంటున్నారు. అలాంటివేవీ అవసరం లేదు. పార్టీ కోసం సంపూర్ణంగా కష్టపడితే ఆటోమెటిక్‌గా పదవులు వరిస్తాయి’ అంటూ మీనాక్షి , (Meenakshi Natarajan) జూమ్ మీటింగ్‌లోనూ తేల్చిచెప్పినట్లు సమాచారం.

 Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం.. పార్టీల వెయిటింగ్!

ఏడాది కావోస్తుంది?
తొలి విడత భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్లు (CorporationChairpersons) బాధ్యతలు తీసుకొని దాదాపు ఏడాది కావొస్తున్నది. ఫస్ట్ లిస్టులో 37 మందికి పదవులు కేటాయించారు. అయితే, ఆ తర్వాత మరో లిస్టులో మిగతా వాళ్లను ప్రకటిస్తామని గతంలో ప్రభుత్వం పేర్కొన్నది. కానీ, ఏడాది కావొస్తున్నా, సెకండ్ లిస్టు ఇప్పటి వరకు రాలేదు. చాలా మంది పార్టీ కార్యకర్తలు, లీడర్లు చైర్మన్ పోస్టులు కోసం వెయిట్ చేస్తున్నారు. తమకు తప్పకుండా వస్తుందని కొందరు భరోసాతో ఉండగా, మరి కొందరు పార్టీలో ఏం జరుగుతుందో? తెలియడం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ లిస్టులో మెజార్టీ చైర్మన్లు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ నుంచే భర్తీ చేయగా, ఈ దఫా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన వాళ్లకు ఛాన్స్ లభిస్తుందని టీపీసీసీ( TPCC) నేతలు స్పష్టం చేస్తున్నారు.

పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సైతం?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ చైర్మన్లు అంతా ప్రభుత్వంలోని అదే విభాగాలు చైర్మన్లు అయ్యారు. దీంతో పార్టీలో ఆయా విభాగాలకు ప్రస్తుతం చైర్మన్లు లేరు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా, ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. దీంతో ఈ దఫా పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్‌ను కూడా భర్తీ చేయాలని టీపీసీసీ( TPCC) ఆలోచిస్తుంది. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. వాటి కంటే ముందే చైర్మన్లు ప్రకటించడం వలన క్షేత్రస్థాయిలో ఆయా విభాగాల నేతలు, టీమ్స్ పార్టీ విజయం కోసం మరింత ఎక్కువగా ఫోకస్ పెడతాయని పార్టీ నమ్మకం. ప్రస్తుతం ఆయా విభాగాలు ఖాళీగా ఉండడం వలన గ్రౌండ్ లెవల్‌లో పార్టీ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు కావడం లేదు.

మాకేంటి?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులను కష్టపడి గెలిపించామని, కానీ ఏడాదిన్నర అవుతున్నా, తమను పట్టించుకునే నాథుడు లేడని కొన్ని నియోజకవర్గాల్లోని నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని (PCC) పీసీసీ అధ్యక్షుడు దృష్టికి కూడా తీసుకొచ్చారు. త్వరలో స్థానిక సంస్థలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భర్తీ చేయాల్సిందేనని ఆయన కూడా ఏఐసీసీ ( AICC) ఇన్‌ఛార్జ్‌కు వివరించారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ చైర్మన్లు, ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లలో ఒక జాబితాను విడుదల చేయాలని పార్టీ సీరియస్‌గా స్టడీ చేస్తున్నది.

 Also Read: GHMC Engineers: బీనామీలతో పనులు దక్కించుకుంటున్న.. జీహెచ్ఎంసీ ఇంజినీర్లు!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు