Agri gold
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Agri Gold: అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట.. వెయ్యి కోట్లు వచ్చేశాయ్!

Agri Gold: అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట లభించింది. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీల నుంచి మోసపోయిన పెట్టుబడిదారుల కోసం రూ. 611 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) పునరుద్ధరించింది. ఈ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (AP Govt) అప్పగించడం జరిగింది. తద్వారా వాటిని బాధితులకు తిరిగి పంపిణీ చేయవచ్చు. కాగా, ఈడీ అటాచ్‌మెంట్ సమయంలో వీటి విలువ రూ.611 కోట్లు. కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1000 కోట్లు మించిపోయే అవకాశం ఉన్నది. ఇంతకు ముందు, 2025 ఫిబ్రవరిలో ఈడీ సుమారు రూ.3,339 కోట్ల విలువైన ఆస్తులను (ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 6,000 కోట్లకు పైగా) బాధితులకు పునరుద్ధరించింది. తాజా పునరుద్ధరణతో కలిపి, ఇప్పటివరకు మొత్తం రూ.3,950 కోట్ల విలువైన ఆస్తులు బాధితులకు తిరిగి అప్పగించబడ్డాయి. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 7,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పునరుద్ధరించబడిన ఆస్తుల్లో 397 వ్యవసాయ భూములు, నివాస.. వాణిజ్య ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. వీటిలో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో, 13 తెలంగాణలో, 4 కర్ణాటకలో ఉన్నాయి.

Read Also- Minister Sridhar Babu: తెలంగాణ అన్ స్టాపబుల్.. వేరే రాష్ట్రాలకు రోల్ మోడల్

అసలేం జరిగింది?
జూన్ 10, 2025న ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌కు నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతి ఇచ్చింది. తద్వారా ఈ ఆస్తులను బాధితులకు పునరుద్ధరించడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ చర్యలు మోసగాళ్ల నుంచి దోచుకున్న ఆస్తులను తిరిగి న్యాయబద్ధంగా బాధితులకు అప్పగించడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న కీలక ముందడుగుగా భావించొచ్చు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA)లోని నిబంధనల ప్రకారం అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు తిరిగి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్, 1999 కింద ఈ ప్రక్రియ జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పొంజీ స్కీమ్‌ను నడిపి, సుమారు 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ నిధులను వివిధ పరిశ్రమలకు దారి మళ్లించి, డిపాజిట్‌లను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. ఈ కేసులో అవ్వా వెంకట రామారావు, అవ్వా వెంకట శేషు నారాయణ రావు, అవ్వా హేమ సుందర వరప్రసాద్‌తో సహా సంస్థ ప్రమోటర్లను ఈడీ అరెస్టు చేసింది. 2021 ఫిబ్రవరిలో 14 మందిపై ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసి, 2024 మార్చిలో మరో 22 మందిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ సమర్పించడం జరిగింది.

Read Also- Ram Mohan Naidu: అయ్యా.. రామ్మోహన్ ఆ మ్యూజిక్, కటింగ్స్‌ ఏంటి.. సినిమానా?

అసలేంటీ అగ్రిగోల్డ్ సంస్థ?
అగ్రిగోల్డ్ అనేది ఒక పెట్టుబడి సంస్థ. ఇది ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, వారికి అధిక వడ్డీ లేదా రాబడులు ఇస్తామని ఆశచూపింది. అయితే, ఇది వాస్తవానికి పొంజీ స్కీమ్ (Ponzi Scheme) ఆధారంగా పనిచేసింది. అంటే, కొత్తగా వచ్చే డిపాజిట్లను ఉపయోగించి పాత డిపాజిట్లకు వడ్డీ చెల్లించడం, భూముల్లో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి ప్రజలను నమ్మించడం జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతున్నామని, తమకు భారీ లాభాలు వస్తున్నాయని, కాబట్టి డిపాజిట్‌ దారులకు అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేసింది. వివిధ రకాల డిపాజిట్ పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసింది. సేకరించిన ఆ నిధులను వాస్తవానికి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టకుండా, ప్రమోటర్లు.. సంబంధిత వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు, ఇతర వ్యాపారాలకు మళ్లించుకున్నారు. కొత్త డిపాజిట్లు తగ్గిపోవడంతో, పాత డిపాజిట్‌దారులకు వడ్డీ లేదా మూలధనం తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈడీ దర్యాప్తు ప్రకారం, అగ్రిగోల్డ్ సుమారు 32 లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు సహా పలు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తునే నష్టపోయారు. కొందరు బాధితులు, ఏజెంట్లు ఈ మోసం కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Read Also- YS Jagan: చంద్రబాబుకు చెంపపెట్టు.. గట్టిగా బుద్ధి చెప్పిన సుప్రీంకోర్టు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ