Kavya Kalyan Ram
ఎంటర్‌టైన్మెంట్

Kavya Kalyanram: కావ్య క‌ళ్యాణ్ రామ్ కొత్త ఫొటోలొచ్చాయ్.. సోషల్ మీడియా షేక్!

Kavya Kalyanram: తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు రావనే నానుడి హల్చల్ చేస్తుంటుంది. కానీ ఆ మాటలు నిజం కాదని నిరూపిస్తుంది కావ్య కళ్యాణ్ రామ్. అందుకు నేను ఉదాహరణ అంటుందీ బొద్దు గుమ్మ. కావ్య కళ్యాణ్ రామ్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. బాల న‌టిగా ‘గంగోత్రి, ఠాగూర్‌, బాలు, బ‌న్ని’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలతో పాటు స్టార్‌ హీరోలంద‌రితో న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ భామ.. దిల్ రాజు (Dil Raju) బేన‌ర్‌లో వ‌చ్చిన ‘మ‌సూద’ (Masoodha) చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచ‌య‌మైంది. హీరోయిన్‌గా కూడా మొద‌టి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన ‘బ‌ల‌గం’ సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది.. టాలీవుడ్‌లో జెండా పాతేసింది. ‘బ‌లగం’ (Balagam) సినిమాలో కావ్య కనిపించిన తీరు.. తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఆమెను మ‌రింత ద‌గ్గ‌ర చేసిందన‌డంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు.

Also Read- Ahmedabad plane crash: ఘోర విమాన ప్రమాదం.. బతికి బయట పడిన చిరంజీవి, సుస్మిత.. నాగబాబు సంచలన పోస్ట్

అటు సినిమాలతో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోస్‌ని వదిలి కుర్రాళ్లను కుదేల్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమెను ఎంతగా ఇష్టపడతారంటే.. ఆమె అలా పోస్ట్ పెడితే చాలు.. ఇలా వైరల్ అవుతుంటుంది. ఆ రేంజ్‌లో ఆమెకు ఫాలోయర్స్ ఉన్నారు. అలాగే ఆమె కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామర్ ఫోటోషూట్స్ ఫొటోలను పోస్ట్ చేసి.. అభిమానులకు, నెటిజన్లకు టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఈ తెలుగు భామ త‌న సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఫోటోలు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాయి. రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో (Kavya Kalyan Ram in Red Color Dress) ఎటువంటి వల్గారిటీ లేకుండానే ఆమె గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్ల కామెంట్స్ కూడా ఎంతో ముద్దుగా ఉన్నాయంటే.. ఈ భామను ఎంతగా వారు ఆదరిస్తుంటారో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Senior Actress: పెళ్ళైన హీరోతో అలాంటి ఎఫైర్.. 52 ఏళ్లయినా అందుకే ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదా?

నెటిజన్లు అంతగా రియాక్ట్ అవడానికి కారణం.. ఫోటోలో ఆమె క్యూట్ అండ్ గ్లామరస్ లుక్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. ‘ఏమైంది సినిమాలు చేయడం లేదు.. నిన్ను కూడా టాలీవుడ్ వదులుకుంటుందా? ఏంటి?, మంచి సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల మనసులు గెలుచుకోండి..’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో ఆమెను ఉత్సాహ పరుస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్ర‌స్తుతం కావ్య క‌ళ్యాణ్ రామ్ రెండు ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వ‌ర‌లోనే వాటి విశేషాలను మేకర్స్ తెలుప‌నున్నారు. ఈ ఫొటోలతో కావ్య పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

OTT MOvie: ఇద్దరు ట్విన్స్‌కు ఒకే క్వీన్.. ఇక చూసుకో ఎలా ఉంటదో..

Golden Care: సీనియర్ సిటిజన్ల కోసం కొత్త కార్యక్రమం.. ప్రారంభించిన సీపీ సుధీర్ బాబు

Seethakka: ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక బతుకమ్మ.. సీతక్క కీలక వ్యాఖ్యలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు

Thaman speech: అలా ఏమీ చేయకపోయినా ‘ఓజీ’ హిట్ చేశారు.. ఎందుకంటే?