Ahmedabad plane crash ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ahmedabad plane crash: ఘోర విమాన ప్రమాదం.. బతికి బయట పడిన చిరంజీవి, సుస్మిత.. నాగబాబు సంచలన పోస్ట్

Ahmedabad plane crash: అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. ఎందుకంటే, అంతక ముందు కూడా ఇలాంటివి జరిగినా .. వందల సంఖ్యలో మరణించింది లేదని నిపుణులు అంటున్నారు. అయితే, తాజాగా మెగా బ్రదర్ నాగ బాబు పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. విమాన ప్రమాదం నుంచి చిరంజీవి, కూతురు సుస్మిత ప్రాణాలతో బయట పడ్డారని నాగ బాబు పోస్ట్ లో రాసుకొచ్చారు.

ఇప్పటికే, ఈ ప్రమాదకర ఘటన పై సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి స్పందించారు. ఈ క్రమంలోనే నాగ బాబు కూడా దీని గురించి ఎమోషల్ పోస్ట్ పెట్టారు.

అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ వినగానే నాకు మాటలు రాలేదు. చాలా బాధ వేసింది. కొన్నేళ్ళ క్రితం ఎంతో మంది సెలబ్రిటీలు ఎక్కిన చెన్నై ఫ్లైట్ తిరుపతిలో ఎక్కడో ల్యాండ్ అయింది. అదే విమానంలో మా అన్నయ్య, మా స్వీటీ(సుష్మిత) ఉన్నారు. సాంకేతిక లోపం వలన ఫ్లైట్ ను తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయిందని చెప్పారు. ఆ క్షణం నాకు చాలా అంటే చాలా భయమేసింది. మా అన్నయ్య, మా స్వీటీ పాప ఎలా ఉన్నారో అని ఆందోళన నా మనస్సును కలచి వేసింది. చాలా సమయం ఓపిక పట్టిన తర్వాత అన్నయ్య,సుష్మిత ,ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళందరూ సేఫ్ అని తెలిసిన తర్వాత కుదుట పడ్డానని అన్నారు.

ఆ ఫ్లైట్ ఆక్సిడెంట్ అయిన రోజు ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ కూడా నాకు ఇంకా గుర్తుంది అంటే అర్దం చేసుకోవచ్చు.
ఈ రోజు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. అలాంటిది ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి విజువల్స్ చూస్తుంటే నా ప్రాణం పోయినంత పనైంది. ఎంతమంది యువకులు అమ్మా , నాన్నలను వదిలి మంచి ఫ్యూచర్ కోసం వెళ్ళి ఉంటారో? వారి ఆశలన్నీ మంటల్లోనే కాలిపోయాయి. జీవితాన్ని అద్భుతంగా ఊహించుకొంటూ ఆ ఫ్లైట్ ఎక్కారు. కానీ, కన్న తల్లికి శోకం మిగిలింది. అసలు ఈ ఫ్లైట్ తోనే సంబంధం లేని మెడికో స్టూడెంట్స్ హాస్టల్ లో లంచ్ చేస్తుంటే పిడిగుపాటులా వాళ్ళ నెత్తిన పడి ప్రాణాలు తీసింది.

ఎన్ని ఆశలతో డాక్టర్స్ అవుదామని చదువు కుంటున్నారో వాళ్ల జీవితాలు వాళ్ళ మీద ఆ తల్లిదండ్రులు ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నారో? నిజంగా ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. ఎవరూ ఊహించ లేనంత ఎన్నో నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. .ఒక రెప్ప పాటు క్షణంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదంతా ఒక పీడకల అయితే ఎంత బాగుంటుంది అనిపించింది. గొంతును ఎవరో నొక్కుతున్నట్లు తలని ఒక రాకాసి హస్తంతో పిసుకుతున్మట్లు గా ఒక రకమైన స్థితిలో నిస్తేజం తో ఉండిపోయాను. కన్నీళ్ళు రావటం లేదు గొంతు పూడుకు పోతుంది. దేవుడున్నాడని నమ్మే అన్ని మతాల వాళ్లు ఆ ఫ్లైట్ లో ఉండే వుంటారు. ఈ దేవుళ్ళు ఏమైపోయారు ఎందుకు కాపాడలేకపోయారు అనిపిస్తుందంటూ ఓ సంచలన పోస్ట్ తన ట్విటర్ లో ట్వీట్ చేశారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?