YS Jagan: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) బిగ్ రిలీఫ్ దక్కింది. వెంటనే కొమ్మినేనిని విడుదల చేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొన్ని ప్రశ్నలు కూడా ప్రభుత్వం, పోలీసులను సంధించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు (CM Chandrababu) గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం’ అని జగన్ వ్యాఖ్యానించారు.
Read Also- Air India flight: మరో ఎయిర్ఇండియా విమానానికి ముప్పు.. అత్యవసర ల్యాండింగ్.. చివరికీ!
ముసుగు వేసుకొని..
‘ అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ (Law And Order) పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి (Kommineni Srinivasa Rao) ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు.. ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు’ అని జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
Read Also- Bail to Kommineni: కొమ్మినేనికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
కుట్ర బద్దలు..!
‘ చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైసీపీకి, సాక్షి మీడియాకు (Sakshi Media) ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడటంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు. సత్యమేవ జయతే..’ అని జగన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు పెద్ద ఎత్తునే కామెంట్లు వస్తున్నాయి. ‘ అధికారం శాశ్వతం కాదు. అధికారం అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోలీసులతో అక్రమ అరెస్టు చేసి అమాయకులను జర్నలిస్టులను జైలుకు పంపడం ఘోరం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆదరిస్తారు’ అని వైసీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం.. ‘ కొమ్మినేనికి వెంటనే బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు తమరికి మాత్రం 42 సార్లు ఎందుకు రిజెక్ట్ చేసింది?’ అని ప్రశ్నిస్తున్న పరిస్థితి.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ‘ 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? డిబేట్ నిర్వహించే వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధం లేదు. టీవీ డిబేట్‌లో (Tv Debate) నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతూ ఉంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుంది’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, కొమ్మినేని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) , మరికొందరు లాయర్లు వాదనలు వినిపించారు.
Read Also- Flight and Train Accidents: అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేస్తారా?
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు @ncbn గారికి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2025