IAS Officers Transfer
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

IAS Officers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ముగ్గురు మంత్రులు ఔట్!

IAS Officers: తెలంగాణలో 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు ముగ్గురు 3 ఐఎఫ్ఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌‌ను నియమించారు. అలాగే గనులశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్‌ మిత్తల్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్‌, ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌‌గా శశాంక్‌ గోయొల్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌‌గా హరిచందన దాసరి, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రటరీ, ఐజీగా రాజీవ్‌గాంధీ హనుమంతు, సమాచారశాఖ కమిషన్‌ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా కిల్లు శివకుమార్‌ నాయుడు, సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌‌గా ఇ. నవీన్‌ నికోలస్‌‌, వ్యవసాయ సహకార శాఖసంయుక్త కార్యదర్శిగా ఎల్‌.శివశంకర్‌.. విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Read Also- Flight and Train Accidents: అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేస్తారా?

ఏ జిల్లాకు ఎవరు?
నిజామాబాద్‌ కలెక్టర్‌‌గా టి.వినయ్‌ కృష్ణారెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా సృజనకు అదనపు బాధ్యతలు, సిద్దిపేట కలెక్టర్‌‌గా కె.హైమావతి, సింగరేణి డైరెక్టర్‌‌గా పి.గౌతమ్‌, ఎయిడ్స్‌ నియంత్రణ సొసైటీ డైరెక్టర్‌‌గా వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, మత్స్యశాఖ డైరెక్టర్‌‌గా కె.నిఖిల, పర్యాటకశాఖ ఎండీగా వల్లూరు క్రాంతి, ఆరోగ్యశ్రీ హెల్త్‌ ట్రస్ట్‌ సీఈవోగా పి.ఉదయ్‌ కుమార్‌, టీజీపీఎస్సీ కార్యదర్శిగా ప్రియాంక ఆల, సంగారెడ్డి కలెక్టర్‌‌గా పి.ప్రావిణ్య, మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్‌‌గా మిక్కిలినేని మను చౌదరి, ఖమ్మం కలెక్టర్‌‌గా అనుదీప్‌ దురిశెట్టి, హనుమకొండ కలెక్టర్‌‌గా స్నేహ శబరీష్‌, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌‌గా ముజామిల్‌ ఖాన్‌‌ నియమితులయ్యారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సీపీఆర్వోగా గుర్రం మల్సూర్‌ను ప్రభుత్వం నియమించింది.

ముగ్గురు మంత్రులు ఔట్
ఇదిలా ఉంటే.. జిల్లా ఇన్‌ఛార్జి పోస్టు నుంచి ముగ్గురు సీనియర్ మంత్రులను తప్పించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను తొలగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇదే సమయంలో ఇటీవల బాధ్యతలు తీసుకున్న ముగ్గురు కొత్త మంత్రులు వివేక్ వెంకట్ స్వామీ, అడ్లూరి లక్ష్మణ్​, వాకిటి శ్రీహరిలకు ఇన్‌ఛార్జిలుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలు వారీగా ఇన్‌ఛార్జ్ మంత్రులను సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌కు ఇంతకాలం మంత్రి దామోదర రాజనర్సింహా ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తుండగా, మళ్లీ ఆయన్నే కంటిన్యూ చేశారు. అంతేగాక రంగారెడ్డికి శ్రీధర్ బాబు, వరంగల్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్‌లో పొన్నం ప్రభాకర్లను మార్చలేదు. కానీ, గతంలో ఆదిలాబాద్‌కు ఇన్‌ఛార్జీ మంత్రిగా ఉన్న సీతక్కను నిజామాబాద్‌కు, నిజామాబాద్‌లో ఇన్‌ఛార్జీగా పనిచేసిన జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్‌కు షప్లింగ్ చేశారు. అదే విధంగా గతంలో కరీంనగర్‌కు ఇన్‌ఛార్జీ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించగా, ఆయన్ను పక్కకు పెట్టి, గతంలో నల్లగొండకు ఇన్‌ఛార్జీ మంత్రిగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ బాధ్యతలు ఇచ్చారు. నల్లగొండకు కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఇన్ ఛార్జీ చేశారు. మెదక్‌కు ఇన్‌ఛార్జీగా ఉన్న కొండా సురేఖను పక్కకు పెట్టి, ఆమె బాధ్యతలను మంత్రి వివేక్‌కు అప్పగించారు. దీంతో పాటు ఖమ్మంకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇన్‌ఛార్జీగా ఉండగా, ఆ స్థానంలో మరో కొత్త మంత్రి వాకిటి శ్రీహరికి ఇన్‌ఛార్జీ బాధ్యతలు కట్టబెట్టారు.

Read Also- Plane Crash: పాపం.. పెళ్లైన 5 నెలలకే.. తీవ్ర విషాదం

మార్పులు చేర్పులు తర్వాత..
దామోదర రాజనర్సింహా : మహబూబ్ నగర్
దుద్దిళ్ల శ్రీధర్ బాబు : రంగారెడ్డి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి : వరంగల్
పొన్నం ప్రభాకర్ : హైదరాబాద్
సీతక్క : నిజామాబాద్
తుమ్మల నాగేశ్వరరావు : కరీంనగర్
జూపల్లి కృష్ణారావు : ఆదిలాబాద్
వివేక్ వెంకటస్వామీ : మెదక్
అడ్లూరి లక్ష్మణ్​ : నల్లగొండ
వాకిటి శ్రీహరి : ఖమ్మం

Read Also- Gopichand33: యోధుడిగా గోపీచంద్.. ఫస్ట్ లుక్ అదుర్స్..

Just In

01

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి