Allu Aravind: నాకు ఇన్‌స్టాలో ఫేక్ ఐడీ ఉంది. దానితో అందరినీ ఫాలో అవుతుంటానని అన్నారు టాలీవుడ్ మెగా నిర్మాత అల్లు అరవింద్. బన్నీ వాస్ (Bunny Vas) నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’ (Mithra Mandali). కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్.ఎం. టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా, గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
Also Read- Plane Crash: విమాన ప్రమాదం బాధాకరం.. టాలీవుడ్ నటుల స్పందనిదే!
ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమా ఇది. అలాగే నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ ‘మిత్ర మండలి’ టీజర్‌ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను యంగ్ స్టర్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటాను. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ అవుతుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నానని ఆ దర్శకుడు వెళ్ళిపోయాడు. నేను కథ వినకుండానే, నేరుగా ఈ సినిమా చూడబోతున్నాం. ఈ చిత్ర దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనుకున్నాను.. ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. యాక్టర్‌గా ఎంత చేయాలో, ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. ‘కోర్ట్’ సినిమాలో అద్భుతంగా నటించాడు.
Also Read- Tollywood: పవన్ కళ్యాణ్ లేఖ పని చేస్తోంది.. ఏపీ సీఎం చెంతకు సినీ ఇండస్ట్రీ!
నిహారిక ఎన్.ఎం.. మై హార్ట్. నా దగ్గరకు వాసు ఓ 5 ఫొటోలు తీసుకు వచ్చి చూపించాడు. మీకు కథ చెప్పకుండా పారిపోయాడే దర్శకుడు.. ఆ సినిమా కోసం ఈ అమ్మాయిలలో ఒకరిని సెలక్ట్ చేయాలి. మీరు చూసి ఇందులో ఒకర్ని సెలక్ట్ చేయమని అడిగాడు. అందులో ఒక ఫొటో చూపించి.. ఈ అమ్మాయి వెరీ గుడ్.. తీసుకో అని చెప్పా. మీకు తెలుసా అన్నాడు.. అబ్బో ఈమెని ఇన్‌స్టాలో తెగ చూశా అని చెప్పా. నాకు ఇన్‌స్టాలో ఫేక్ ఐడీ ఒకటి ఉంది. దానితో అందరినీ ఫాలో అవుతూ ఉంటా. ఈ అమ్మాయిని కూడా ఫాలో అవుతున్నాను. ఫేక్ ఐడీ ఎందుకు అని అంతా అనుకుంటారు. మా ఐడీతో అకౌంట్ పెట్టుకుంటే.. నెటిజన్లు పెట్టే కామెంట్స్ వినలేము.. చూడలేము.. చదవలేము.. అంత దరిద్రంగా పెడుతుంటారు. అందుకే.. నేను ఎవరో తెలియకుండా.. అందరినీ ఫాలో అవుతూ ఉంటా. అందరి ఫొటోలు చూస్తుంటాను. అలాగే నిహారిక అకౌంట్ కూడా చూస్తూ ఉంటాను. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్ర నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అని అన్నారు. ఇక అల్లు అరవింద్ స్పీచ్ విన్న నెటిజన్లు కొందరు.. ‘అల్లు మామ.. మంచి చమత్కారే.. చాలా విషయం ఉంది లోపల’ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు