TG on Panchayats (imagecredit:twitter)
తెలంగాణ

TG on Panchayats: గ్రామ పంచాయతీల్లో 17 రకాల లక్ష్యాలు.. సక్సెస్ చేసేలా ప్రణాళికలు

TG on Panchayats: ప్రభుత్వం పల్లెలపై ప్రత్యేక దృష్టిసారించింది. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. లక్ష్యాలను విధించుకొని గ్రామాల అభివృద్దికి చర్యలు చేపడుతోంది. గ్రామంలోని సమగ్ర వివరాలను ఎప్పటికప్పుడు వెబ్ సైట్లో పొందుపరుస్తున్నారు. అందుకు గ్రామపంచాయతీ కార్యదర్శికి ప్రత్యేకంగా లాగిన్ ఇచ్చారు. ఆ అభివృద్ధిని చూసే ప్రతి ఏటా కేంద్రం నేషనల్ బెస్ట్ అవార్డులకు గ్రామాలను ఎంపిక చేస్తుంది. ప్రోత్సాహక నగదు అందజేస్తుంది. అవార్డుకు మరిన్ని గ్రామాలు ఎంపికే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

పంచాతీలో 16 రకాల లక్ష్యాలు

పల్లెల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలోనే రాష్ట్రాన్ని అత్యుత్తమ స్థానంలో నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించింది. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతుంది. పంచాతీలో 16 రకాల లక్ష్యాలను నిర్దేశించింది. వాటిని 9 థీమ్స్ (లోకల్ సస్టెనేబుల్ డెవలప్ మెంట్ గోల్స్) పంచాయతీల కోసం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సహాయపడనున్నాయి. ధీమ్స్ లో ప్రధానంగా పేదరిక నిర్మూలన, ఆరోగ్యకర పంచాయతీ, ఛైల్డ్​ ఫ్రెండ్లీ పంచాయతీ, నీరు, పరిశుభ్రత పంచాయతీ, ఆకుపచ్చ గ్రామం, మౌలిక సదుపాయాలు, సామాజికంగా సురక్షిత, సుపరిపాలన, ఉమెన్​ ఫ్రెండ్లీ పంచాయతీ అనే లక్ష్యాలను సాధించడంపై ఫోకస్​ పెట్టింది. పంచాయతీల్లో ఈ అంశాలను పూర్తిస్థాయిలో సక్సెస్​చేసి నేషనల్​బెస్ట్​పంచాయతీల్లో అగ్రస్థానంలో నిలవాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నది.

Also Read: ACB Arrest: కాళేశ్వరం మాజీ ఈఈ అరెస్ట్.. రెండు వందల కోట్లకు పైగా ఆస్తులు సీజ్!

గ్రామానికి సమగ్ర స్వరూపం

ఈ– గ్రామ్​స్వరాజ్‌లో భాగంగా పల్లెల్లో 9 థీమ్స్​లోని అమలు చేసిన అంశాలను PAI.gov.in (పంచాయతీ పురోగతి సూచిక) వెబ్ సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. 2023–24 సంవత్సరానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఈ సంవత్సరంలో ఆయా గ్రామాల్లో ఎన్ని అంగన్వాడీలు ఉన్నాయి? అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారు? వారికి పోషకాహారం అందుతుందా? లేదా? పోషకాహారం లోపం ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? అదే విధంగా ఆరోగ్య కేంద్రం ఉందా? లేదా? పాఠశాలు ఉన్నాయా? అందులో వసతులు, పిల్లల సంఖ్య తదితర అంశాల వారీగా పంచాయతీ కార్యదర్శి నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామానికి సమగ్ర స్వరూపం సైతం అందులు పొందుపర్చాల్సి ఉంటుంది. అదే విధంగా యువత, జనాభా, రేషన్ దుకాణాలు, తదితర వివరాలను అప్ లోడ్ చేయడం జరుగుతుంది. సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకంగా లాగిన్‌ను ప్రభుత్వం కల్పించింది. అందులో అంశాల వారీగా ఉంటుంది. అంశాలను ఆన్​లైన్​ చేసి సంబంధిత డిపార్ట్​మెంట్​లకు పంపిస్తారు. అయితే, వీటి ఆధారంగానే కేంద్రం ‘నేషనల్​ బెస్ట్​ పంచాయతీ’ల అవార్డులను ప్రకటిస్తుంది. అంశాల వారీగా మార్కులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఎంపికైన ప్రతి గ్రామానికి నిధులు అందజేయనుంది. తొమ్మిది థీమ్స్​ ఆధారంగా పంచాయతీల పనితీరును మదింపు చేయనున్నారు. వీటి ఆధారంగానే పంచాయతీలకు గ్రేడ్లు కేటాయిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన డీఆర్డీవోలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డీఎల్​పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, డీపీఎంలు, పంచాయతీ సెక్రటరీలకు నాలుగు రోజులపాటు ఇస్తున్న శిక్షణ శుక్రవారంతో ముగుస్తుంది. హైదరాబాద్​ రాజేంద్రనగర్లోని తెలంగాణ ఇన్​స్టిట్యూట్​ఆఫ్​రూరల్​డెవలప్​మెంట్ (టీజీఐఆర్డీ) లో జిల్లాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. తొలిరోజు ఈ నెల 10న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంగనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలు,11న, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, జయశంకర్​భూపాలపల్లి, మహుబూబాబాద్, ములుగు జిల్లాలు, 12న నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, యాద్రాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, ఈ నెల13న శుక్రవారం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహుబూబ్​నగర్, జోగులాంబ గద్వాల, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లా వారీగా ఓరియంటేషన్​ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్​సృజన ఆధ్వర్యంలో 9 థీమ్స్‌తో ఈశిక్షణ పూర్తి చేశారు.

ప్రజలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ఏది ఏమైనా పల్లెలపై, ప్రజలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అధికారుల పనితీరుపైనా ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషిచేస్తున్నారా? లేదా? అని మానిటరింగ్ చేసి, విధుల్లో అలక్ష్యం ప్రదర్శించే వారిపై చర్యలకు సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వ చర్యలతో గ్రామాల్లో పల్లెలు అభివృద్ధి బాటపట్టనున్నాయి.

Also Read: MP Etela Rajender: రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించ లేదనడం దారుణం.. ఈటల రాజేందర్

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!