Trivikram Srinivas: కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి ప్రాజెక్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో ఉండబోతుందని. ‘పుష్ప 2’ సమయంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో, పురాణాలకు సంబంధించిన సబ్జెక్ట్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌తో బిజీ అవుతాడని అంతా అనుకున్నారు. ‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్ కూడా ఖాళీగానే ఉన్నారు. అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఏం జరిగిందో, ఏమో తెలియదు కానీ.. ఇప్పుడీ ప్రాజెక్ట్ చేతులు మారినట్లుగా టాక్ వినబడుతోంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా? అంటే అలాంటి పరిణామాలేం కనిపించలేదు. త్రివిక్రమ్ విషయంలో అల్లు అర్జున్ ఎలాంటి విభేదాలు పెట్టుకునే సాహసం చేయరు. ఎందుకంటే, సుకుమార్ లైఫ్ ఇస్తే.. అల్లు అర్జున్‌ని స్టార్ హీరోగా నిలబెట్టింది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాసే. కాబట్టి.. వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు వచ్చే ఛాన్సే లేదు.
Also Read- TFCC Chairman: పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి.. ఏమిటంటే?
మరేం జరిగింది? అని అటు అల్లు అర్జున్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు, మధ్యలో రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ కామెంట్స్ చేస్తున్నారు. మధ్యలో రామ్ చరణ్ అభిమానులు ఎందుకు వచ్చారంటే, ఇటీవల త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంబోలో సినిమా అంటూ వార్తలు బీభత్సంగా వైరల్ అయ్యాయి. దాదాపు కన్ఫర్మ్ అన్నట్లుగా సోషల్ మీడియాలోనే కాదు, మీడియాలో కూడా టాక్ నడిచింది. కట్ చేస్తే, నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌తో అందరి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ‘నాకు అత్యంత ఇష్టమైన అన్న.. అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకరిగా కనిపిస్తారు’ అంటూ కార్తికేయుడి పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిర్మాత నాగవంశీ. అలాగే త్రివిక్రమ్ తదుపరి చేయబోయే రెండు సినిమాలు, అందులో నటించే హీరోలు వివరాలు అంటూ.. తాజాగా ఆయన చేసిన పోస్ట్‌తో మరింత క్లారిటీ ఇచ్చేశారు.
నాగవంశీ అత్యంత ఇష్టంగా.. అన్నా అని పిలిచేది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌నే (Jr NTR). ఆ విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇక తాజా పోస్ట్‌లో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), జూనియర్ ఎన్టీఆర్‌లతో త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్‌లు ఉంటాయని, మిగతా హీరోలకు సంబంధించి వినిపిస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇస్తూ.. అలాంటిది ఏదైనా ఉంటే నేనే ముందుగా ప్రకటిస్తానని నాగవంశీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వెంకీతో త్రివిక్రమ్ సినిమా అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహాలో ఉంటుందనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక తారక్‌తో చేయబోయే సినిమా మాత్రం కచ్చితంగా అల్లు అర్జున్‌తో చేయాలనుకున్న పురాణాల కథకు సంబంధించినదే అని ఫిక్సయిపోవచ్చు. కార్తికేయ పద్యం, అత్యంత ఇష్టమైన వ్యక్తి, తారక్‌తో సినిమా.. ఇంతకంటే ఇంకేం క్లూస్ కావాలి. కార్తికేయుడిగా కనిపించేది జూనియర్ ఎన్టీఆరే అని చెప్పడానికి అని అప్పుడే వార్తలు కూడా మొదలయ్యాయి. అయితే అల్లు అర్జున్‌తో సినిమా ఏమైంది? అంత అట్టహాసంగా ప్రకటించి.. ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారేంటి? త్రివిక్రమ్‌ని కాదని అట్లీతో అల్లు అర్జున్ కమిట్ అవడానికి కారణం ఏమిటనేది మాత్రం ఇంకా తెలియని ప్రశ్నలుగానే మిగిలిపోయి ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుస్తుందని ఆశిద్దాం..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు