Plane Crash Vijay Rupani
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Air India Plane Crash: విమాన ప్రమాదంలో మాజీ సీఎం.. బంధువులు ఏమంటున్నారంటే

Air India Plane Crash: అహ్మదాబాద్‌లో గురువారం ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా (Air India Plane Crash) బోయింగ్ 787 స్టార్ లైనర్‌లో (Boeing 787 StarLiner) గుజరాత్ (Gujarat) మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనలో రూపానీ తీవ్రంగా గాయపడ్డారని ఆయన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రూపానీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగువారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా, ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరణించారంటూ ప్రచారం
ప్రమాదానికి గురైన విమానంలో విజయ్ రూపానీ ఉన్నారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్‌లో అత్యంత ప్రభావవంతమైన నేత కావడంతో బీజేపీ శ్రేణులు, నాయకులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఆయనకు ఏం జరిగిందో ఏమోనంటూ కంగారు పడుతున్నారు. అయితే, విజయ్ రూపానీ మరణించారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయకుండా ఈ మేరకు పోస్టులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు, సమగ్ర సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాత మృతుల సంఖ్య, వివరాలు ప్రకటించాలని డీజీసీఏ నిర్ణయించింది. వీలైనంత త్వరగా ప్రకటన చేసేందుకు సిద్ధమని తెలిపింది.

Read this- Air India Plane Crash: విమానం ప్రమాదంపై వెలుగులోకి సంచలన నిజాలు

లండన్‌లో రూపానీ భార్య
విజయ్ రూపానీ భార్య అంజలీ రూపానీ ప్రస్తుతం లండన్‌‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకే విజయ్ రూపానీ లండన్ బయలుదేరారని సమాచారం. విజయ్ రూపానీకి సన్నిహితుడు, మాజీ మంత్రి భూపేంద్రసింగ్ మాట్లాడుతూ, రూపానీ ఇవాళే (గురువారం) లండన్ వెళ్లాల్సి ఉందని, అయితే, ఆయన ఫ్లైట్‌లో ఉన్నారో లేదో తెలియదన్నారు. ‘‘గుజరాత్ విద్యాపీఠ్‌లో ఒక కార్యక్రమం ఉంటే వెళ్లి వచ్చాను. మధ్యాహ్నం భోజనం చేశాక, టీవీ ఆన్ చేసి చూడగా అహ్మదాబాద్ నుంచి లండన్‌ వెళ్లాల్సిన విమానం కుప్పకూలినట్టు న్యూస్ వచ్చింది. విజయ్ రూపానీ ఇవాళే లండన్ వెళ్లాల్సి ఉందని నాకు తెలుసు. అందుకే, నాకు తీవ్ర ఆందోళన కలిగించింది. ఫ్లైట్‌లో ఆయన ఉన్నారో, లేరో నేను కచ్చితంగా చెప్పలేను. అందుకే, వెంటనే టీవీ ఆఫ్ చేసి విజయ్ రూపానీ నివాసానికి వెళ్లాను. మరింత సమాచారం తెలుసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు వెళుతున్నాను’’ అని భూపేంద్రసింగ్ చెప్పారు.

Read this- Air India: పైలట్ చివరి మాటలు.. మేడే కాల్ అంటే ఏంటి?

గుజరాత్ 16వ సీఎంగా బాధ్యతలు
విజయ్ రూపానీ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే, 1956 ఆగస్టు 2న రంగూన్‌లో (ప్రస్తుతం యంగూన్, మయన్మార్) జన్మించారు. దేశంలోని కీలక రాజకీయ నాయకులలో ఒకరు. బీజేపీలో ముఖ్యనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్‌‌కు 16వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు ఐదేళ్లపాటు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కీలక పదవులు చేపట్టారు. 1996-97 కాలంలో రాజ్‌కోట్ మేయర్‌గా, 2006-2012 వరకు రాజ్యసభ ఎంపీగా, ఆ తర్వాత గుజరాత్ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. రవాణా శాఖ, కార్మిక శాఖ, నీటి సరఫరా శాఖలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవి దక్కడానికి ముందు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?