Air India Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ‘బోయింగ్ 787 ఎయిర్‌లైనర్’ (Boeing 787 Dreamliner) కుప్పకూలిన (Air India Plane Crash) ఘోర విషాదానికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం 625 అడుగుల ఎత్తు నుంచి నిమిషానికి ఏకంగా 475 అడుగుల వేగంతో కిందకు పడిందని సమాచారం. దీంతో, పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించి స్పందించేందుకు కేవలం ఒక నిమిషం మాత్రమే సమయం ఉంది. కాబట్టి, పైలట్లు స్పందించే అవకాశం కూడా లేకుండానే ఈ దారుణ విషాదం చోటుచేసుకుంది.
Read this- Air India: విమాన ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలు ఇవే!
పైలట్ల అనుభవం ఎంత?
ప్రమాదానికి గురైన విమానానికి కెప్టెన్‌గా సుమిత్ సబర్వాల్ వ్యవహరించారు. క్లైవ్ కుందర్ కో-పైలట్‌గా వ్యవహరించారు. వీరిద్దరికి విమానాలు నడిపిన అనుభవం చాలానే ఉంది. ఇద్దరికీ కలిపి ఏకంగా 9,300 గంటల పాటు విమానాలను నడిపిన ట్రాక్ రికార్డు ఉంది. ఈ విషయాన్ని డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) గురువారం అధికారికంగా ప్రకటించారు. కెప్టెన్ సిబర్వాల్‌కు 8,200 గంటల అనుభవం ఉంది. ఇక, కో-పైలట్ క్లైవ్ కుందర్‌కు 1,100 గంటలపాటు విమానాలు నడిపిన ఎక్స్‌పీరియన్స్ ఉందని డీజీసీఏ (DGCA) వివరించింది.
Read this- Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక సోనమ్ ఫ్యామిలీ హస్తం!
విమానంలో విజయ్ రూపానీ
మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే, విమానం గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరగా, టేకాఫ్ తీసుకున్న 5 నిమిషాలకే కుప్పకూలింది. ఎయిర్‌పోర్టుకు సమీపంలోని మేఘాని నగర్‌లో కుప్పకూలడంతో, పెద్ద పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కాగా, ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 232 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇందులో ఉన్నారు.
100 మంది వరకు మృతి?
బోయింగ్ స్టార్ లైనర్ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణించారు. వీరిలో సుమారుగా 100 మందికి పైగానే మరణించి ఉండవచ్చనే ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. 110 మంది వరకు ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్యను డీజీసీఏ ఇంతవరకు ప్రకటించలేదు. అన్ని వివరాలను నిర్ధారించుకున్న తర్వాత అధికారికంగా ఒక ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నాయి. కాగా, 242 మంది ప్రయాణికుల్లో అత్యధికంగా 169 మంది భారతీయులు ఉన్నారు. మరో 53 మంది విదేశీయులు ఉన్నారు.