Air India Flight Crashed (Image Source: Twitter)
జాతీయం

Air India Flight Crashed: కుప్పకూలిన విమానం.. ఫ్లైట్‌లో మాజీ సీఎం.. 100 మందికి పైగా మృతి?

Air India Flight Crashed: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం కూలిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో విమానం టేకాఫ్ అవ్వగా.. ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో 110 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

మధ్యాహ్నం 1:17 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయినట్లు తెలుస్తోంది. గాల్లోకి 825 అడుగుల ఎత్తుకు చేరుకోగానే ఒక్కసారిగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి గురైన విమానం.. వైడ్‌బాడీ బోయింగ్‌ 787 డ్రీమ్‌ లైనర్‌ అని అధికారులు తెలిపారు. 300 మంది వరకూ ప్రయాణించే సామర్థ్యం విమానానికి ఉందని.. ఈ ఫ్లైట్ 11 ఏళ్లుగా సేవలు అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు తెలియజేశారు.

మరోవైపు ప్రమాద ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రి. విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్, ఫస్‌ ఆఫీసర్‌గా క్లైవ్ కుండర్‌ వ్యవహరించినట్లు పేర్కొంది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు రన్ వే 23 నుంచి విమానం గాల్లోకి ఎగిరిందని కొద్ది సేపటికే ఏటీసీకి అత్యవసర కాల్‌ వచ్చిందని తెలిపింది. ఆ వెంటనే విమానం కూలిపోయిందని స్పష్టం చేసింది. మరోవైపు ఎయిర్ఇండియా సైతం ఈ ఘటనపై స్పందించింది. ప్రమాధాన్ని ధ్రువీకరిస్తూ ఘటనకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపింది.

ప్రమాదానికి గురైన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం స్పందించినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడుతో అత్యవసరంగా మాట్లాడారు. ఘటనకు సంబంధించిన సమాచారం అడిగిన తెలుసుకున్న మోదీ.. సహాయక చర్యలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన చేయాలని ఆదేశించారు. మరోవైపు విజయవాడలో ఉన్న రామ్ మోహన్ నాయుడు.. హుటాహుటీన అహ్మదాబాద్ బయలు దేరారు. ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని.. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

Also Read: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. హత్య వెనుక సోనమ్ ఫ్యామిలీ హస్తం! 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు