Producer Dil Raju
ఎంటర్‌టైన్మెంట్

Dil Raju: పెయిడ్ వ్యూస్.. నా పీఆర్ టీమ్‌కు ఆ సూచన చేశా!

Dil Raju: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నితిన్ (Nithiin) హీరోగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో బుధవారం మేకర్స్ విడుదల చేశారు. చిత్రయూనిట్ మొత్తం పాల్గొన్న ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read- Mega157: పరుగులు పెట్టిస్తున్న అనిల్ రావిపూడి.. అప్పుడే రెండో షెడ్యూల్!

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. మా సంస్థలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘తమ్ముడు’ మూవీ విడుదల తేదీని ఎప్పుడెప్పుడు ప్రకటిద్దామా? అని ఎంతగానో ఎదురుచూశాం. ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు దాదాపు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ కథ అనుకున్నప్పుడే విజువల్, సౌండింగ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని అతను చెప్పాడు. అన్నట్లుగానే ఈ సినిమాను చాలా కష్టపడి చేశాడు. ఈ సినిమా ‘ముద్దుల మామయ్య’లా ఉంటుందా? అని మీడియా మిత్రులు అడుగుతున్నారు. ఇది అక్కా తమ్ముడి మధ్య జరిగే కథ.. కానీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. దీనికి ఏ మూవీ రిఫరెన్స్ లేదు. ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత కూడా ఇదే స్పందనను రాబట్టుకుంటుందని, ‘తమ్ముడు’ మూవీనే ఒక రిఫరెన్స్‌గా ఉంటుందని నమ్ముతున్నాం. సిస్టర్ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు శ్రీరామ్ వేణు యూఎస్‌లో ఉన్న లయని అప్రోచ్ అయి, స్క్రిప్ట్ చెప్పి ఒప్పించాడు. లయ మా సంస్థ ద్వారా మళ్లీ ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఉంది. ‘కాంతార’ తర్వాత సప్తమి గౌడను మంచి క్యారెక్టర్‌కు సెలెక్ట్ చేశాడు వేణు. నితిన్‌కు ‘తమ్ముడు’ మూవీ చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ బాగుందంటూ మీడియా మిత్రుల నుంచి ఫోన్స్, మెసేజెస్ వస్తున్నాయి. మేము ఎగ్జామ్ రాశాం. జూలై 4న రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా మా మూవీ ఆడియెన్స్‌కు నచ్చుతుందని నమ్ముతున్నాం.

Also Read- Thammudu Trailer: మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. అదే మనిషి పోయి మాట బతికితే..!

ఇప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు తీసుకురావడం చాలా కష్టంగా మారింది. మా ట్రైలర్ నచ్చింది కాబట్టి మీడియా మా మూవీకి బాగా ప్రచారం కల్పిస్తారని ఆశిస్తున్నాను. గత ఆరు నెలల్లో నాలుగైదు సినిమాలు మాత్రమే ఆదరణ పొందాయంటే థియేట్రికల్‌గా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మా డైరెక్టర్, హీరో, ఇతర టీమ్ అంతా ఒక మంచి మూవీ చేసేందుకు కష్టపడ్డారు.. చేశారు. థియేట్రికల్‌గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా ‘తమ్ముడు’. సినిమా మేకింగ్ టైమ్‌లో టెక్నికల్‌గా క్వాలిటీ కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సివచ్చింది. వేణును పిలిచి అడిగితే ఈ సినిమాకు విజువల్, సౌండ్ క్వాలిటీగా చేస్తున్నామని అన్నాడు. బడ్జెట్ గురించి చెప్పగానే, నేను ఇప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేయను అన్నాడు, అలాగే నితిన్‌కు ఫోన్ చేసి పరిస్థితి చెబితే.. మీరు ఎంత పంపిస్తారో పంపించండి. నా రెమ్యునరేషన్ గురించి పెద్దగా డిమాండ్ చేయనని అన్నాడు. ప్రొడ్యూసర్ పరిస్థితి తెలుసుకుని డైరెక్టర్, హీరో ఇలా సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇది కచ్చితంగా ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని తీసుకువస్తుంది. సినిమా సక్సెస్ అయితే అందరి రెమ్యునరేషన్స్ పెరుగుతాయి. కానీ, ఫ్లాప్ వస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్‌కు జెన్యూన్‌గా ఎన్ని వ్యూస్ వస్తాయో.. అంతే చెప్పాలనుకున్నాం. పెయిడ్ వ్యూస్ వద్దని, నా పీఆర్ టీమ్‌కి కూడా చెప్పాను. సినిమా కంటెంట్ ప్రేక్సకులకు రీచ్ అవుతుందో, లేదో.. ఆ పెయిడ్ వ్యూస్‌తో తెలియడం లేదు. అందుకే, ఇకపై అలాంటివేమీ వద్దని చెప్పాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తెలుగు సినిమా ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఈ పొజిషన్‌ను కాపాడాలంటే ఇండస్ట్రీలో అందరం కష్టపడాలి. ప్రతి సినిమాను జెన్యూన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలి. అందుకు మీడియా సహకారం కోరుతున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు