Mega157: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘Mega157’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను ఈ టీమ్ ముగించిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ఇతర తారాగణం పాల్గొన్నారు. మొదటి షెడ్యూల్ రషెస్ అద్భుతంగా వచ్చాయని టీమ్ చెబుతోంది. 1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను ఈసారి మళ్లీ చూపించబోతున్నట్లుగా ఇప్పటికే హింట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌గా కూడా ఉండబోతుందని టీమ్ చెబుతోంది.
Also Read- Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ.. ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు!
ఇక హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అనిల్ రావిపూడి మాములుగా పరుగులు పెట్టించడం లేదు. అనిల్ రావిపూడితో అట్లుంటది అనేలా.. పక్కా ప్లానింగ్‌లో షూటింగ్ షెడ్యూల్‌ని డిజైన్ చేసుకున్న అనిల్ రావిపూడి, ఏ మాత్రం తన ప్లాన్ చేంజ్ కాకుండా దూసుకెళుతున్నాడు. మెగా157కి సంబంధించిన రెండో షెడ్యూల్ బుధవారం ముస్సోరీలోని బ్యూటీఫుల్ హిల్ స్టేషన్‌లో ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ 10 రోజుల షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్ వంటి ప్రధాన తారాగణం పాల్గొనున్నారని, చిత్ర బృందం కొన్ని కీలకమైన, వినోదాత్మక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనుందని టీమ్ ప్రకటించింది. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ తర్వాత చిరుతో నయనతార మూడోసారి కలిసి నటించనుంది.
Also Read- Thammudu Trailer: మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. అదే మనిషి పోయి మాట బతికితే..!
ఇక రెండో షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన వీడియోలో.. మెగాస్టార్ చిరంజీవి ఒక స్కూల్ గ్రౌండ్‌లో టేబుల్ మీద కూర్చోని వుంటే, పిల్లలు తనవైపు పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆయన థంబ్స్ అప్ ఇస్తున్నారు. ఈ విజువల్ చూడటానికి చాలా ప్లజెంట్ గా వుంది. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం ఈ వీడియోకు మరింత జాయ్‌ని యాడ్ చేసింది. ఈ వీడియోలో చిరంజీవి చరిష్మాటిక్ ప్రజెన్స్ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. ఇటీవల వచ్చిన ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. తన ట్రేడ్‌మార్క్, క్రియేటివ్ ప్రమోషన్స్‌తో Mega157పై ఇప్పటికే ఉత్సాహాన్ని రేకెత్తించారు. ఇప్పుడాయన స్పీడ్ చూస్తుంటే, చిరు ‘విశ్వంభర’ కంటే ముందే ఈ సినిమా విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేలా ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటూ ఉండటం విశేషం. Mega157 చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Mountains. Magic. Megastar. ❤️🔥❤️🔥❤️🔥
The second schedule of #Mega157 begins in Mussoorie where some crucial and entertaining scenes featuring Megastar @KChiruTweets, #Nayanthara and other main cast will be shot 😍#ChiruAnil SANKRANTHI 2026 – రఫ్ఫాడించేద్దాం 🔥 @anilravipudi… pic.twitter.com/N2NOCPABPd
— Shine Screens (@Shine_Screens) June 11, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు