YS Jagan: టైటిల్ చూడగానే… దివంగత ప్రధాని ఇందిరా గాంధీతో (Indira Gandhi) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) పోలికేంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? అని సందేహాలు కలుగుతున్నాయ్ కదూ? అయినా ఆశకు హద్దూ అదుపు లేకపోతే ఎలా? నక్కకు నాగ లోకానికి పోలిక పెట్టకూడదు కదా? అనే ప్రశ్నలు మీకు కూడా వస్తున్నాయ్ కదా? అయితే ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు మాత్రం చాలా లాజిక్‌గా, హిస్టరీలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని మరీ విశ్లేషణలు చేస్తున్న పరిస్థితి. ఇంతకీ వైసీపీ కార్యకర్తలు చెబుతున్నదేంటి? ఈ పోలికల వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఈ పోలికపై నెటిజన్లు, టీడీపీ, జనసేన శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..
Read Also- YS Jagan: ప్రధాని మోదీపై ప్రేమ అస్సలు తగ్గలేదుగా!
ఇదీ అసలు కథ..
ఎమర్జెన్సీ (Emergency) విధించిన ఇందిరమ్మనే ప్రజలు ఒకసారి ఓడించి తిరిగి గెలిపించుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఒక్క విషయాన్ని పట్టుకొని వైఎస్ జగన్‌ను ఇందిరతో పోల్చుకుంటూ ఊహాలోకంలో తేలిపోతున్నది వైసీపీ అండ్ కో. ఎంతలా అంటే రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డే మళ్లీ రాష్ట్ర ప్రజలకు కచ్చితంగా ఒక హోప్ (ఆశాజనకం) అవుతారని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటున్నారు. దీనికి లేనిపోని లాజిక్‌లు చెబుతున్న పరిస్థితి. 1977 ఎన్నికల్లో రాయ్ బరేలీలో ఇందిర, అమేదిలో తనయుడు సంజయ్ గాంధీ ఇద్దరూ ఘోర పరాజయం పాలయ్యారు. అప్పట్లో ఉత్తరాదిలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో జనతా పార్టీ స్వీప్ చేసేసింది. అయితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్నంగా 42 ఎంపీ స్థానాలకు 41 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కాగా, ఒక్క నంద్యాలలో మాత్రం నీలం సంజీవ రెడ్డి జనతాపార్టీ తరపున గెలుపొందారు. సరిగ్గా మూడేళ్ళ తర్వాత 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరమ్మను దేశ ప్రజలు తిరిగి ప్రధానిగా ఎన్నుకున్నారు. అదికూడా ఎక్కడైతే తల్లి, కొడుకు ఓడిపోయారో అక్కడే తిరిగి విజయం సాధించడం గమనార్హం. ఎదురు గాలిలో కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు 42కు 41 స్థానాలు ఇచ్చిన కారణంగా ఇందిర 1980 ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేశారు.
ఆశలన్నీ జగన్‌పైనే..!
ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీనే ప్రజలు ఒకసారి ఓడించి తిరిగి గెలిపించుకున్నారని.. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను కూడా ఇప్పుడు ఓడించిన ప్రజలే గెలిపించుకుంటారని వైసీపీ శ్రేణులు విశ్లేషణలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే.. జగన్ ఒక్క కార్యకర్తలకు తప్ప ఏ వర్గానికి అన్యాయం చేసింది లేదని.. పైగా ఆయనపై జనంలో ఏర్పడిన వ్యతిరేక భావన ఇంకో ఏడాదిలో పూర్తిగా తొలగిపోతుందని సైతం జోస్యం చెబుతున్నారు. ఆయనపై ప్రజలు మళ్లీ ఆశలు పెట్టుకునే పరిస్థితి వందకు వెయ్యి శాతం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. కూటమి సర్కార్ ఏడాది పాలన తర్వాత ప్రజల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఏ కొద్దిగా కూడా అనుకూల భావన కూడా లేదు, ఉండే ప్రసక్తే లేదని జగన్ వీరాభిమానులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఇప్పుడిప్పుడే మొదలవుతోందని.. ఇంకో ఏడాదికి ప్రజలు బహిరంగంగా మాట్లాడుకునే స్థితి వస్తుందని ఓ వైపు వైసీపీ శ్రేణులు.. మరోవైపు ఆ పార్టీ నేతలు.. రాజకీయ విశ్లేషకులు సైతం కొందరే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆపండ్రా.. బాబోయ్!
వైసీపీ శ్రేణుల విశ్లేషణలకు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. విమర్శకులు, నెటిజన్లు.. మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు అయితే అబ్బో.. మాటల్లో చెప్పలేం, రాతల్లో రాయలేం ఆ రేంజిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘ హోప్ ఏమో గానీ, ఓ సామాజిక వర్గానికి కచ్చితంగా పోప్ అవుతారు’ అని టీడీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. ‘నక్కకు నాగ లోకానికి పోలిక పెట్టకూడదు! ఆహం విషయంలో మాత్రమే వారు సమకాలీకులు కావచ్చేమో! ఇందిరా గాంధీ రాజధాని మార్పు చేసేవారు కాదు! ప్రజలను కుల, మత, వర్గ విభేధాలతో పరిపాలించేవారు కాదు! ఆశయం కోసం దేనికైనా తెగించి పోరాడే నారీమణి ఆమె! ఆమె ఒక సేఫ్ నియోజకవర్గం ఎంచుకోలేదు గెలవడానికి!’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘ ఇందిరా గాంధీ ల్యాండ్, మైనింగ్, స్యాండ్, లిక్కర్, వేల ఎకరాల భూమిని స్కాంలు.. తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు ప్రజాధనం దొచుకున్నారా?’ అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ‘ పోయి పోయి ఒక ఉక్కు మహిళతో దేశం కోసం ఉగ్రవాదుల చేతిలో హతమైన ఒక మహా నాయకురాలితో పోలికా? కనీసం ఆమె పక్కన జగన్ ఫోటో పెట్టడానికి కూడా అర్హుడు కాదు. ఆవిడ ఏమన్నా తన తండ్రి జవహర్ లాల్ నెహ్రూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల కోట్ల అవినీతి చేసి జైలుకు వెళ్లారా? అప్పటి దేశ పరిస్థితుల దృష్ట్యా విధించిన ఎమర్జెన్సీ దాని ద్వారా కొందరు స్వార్ధ నాయకుల దుష్ప్రచారం వల్ల ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలు గ్రహించారు. ఆమెకు ఉన్న నీతివంతమైన చరిత్రలో సున్నాలో వందవ వంతు కూడాలేని ఈ అవినీతి సామ్రాట్‌ను, అప్రజాస్వామిక వాదిని పోల్చటం దేశ రాజకీయాలకే అవమానం’ అని నెటిజన్లు మండిపడుతున్నారు.
Read Also- AS Ravi Kumar Chowdary: సినీ పరిశ్రమలో మరో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ AS రవికుమార్ చౌదరి మృతి