Singer Mangli Birthday Party
ఎంటర్‌టైన్మెంట్

Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ.. ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు!

Singer Mangli: సింగర్ మంగ్లీపై చేవెళ్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. పుట్టినరోజును పురస్కరించుకొని మంగ్లీ చేవెళ్ల ఈర్లపల్లి ప్రాంతంలోని త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి సింగర్ మంగ్లీ పార్టీ (Singer Mangli Birthday Party) ఇచ్చింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్టు సమాచారం రావటంతో ఎస్ఓటీ అధికారులు, చేవెళ్ల పోలీసులు దాడి జరిపారు. తనిఖీలు జరిపి పెద్ద మొత్తంలో విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పార్టీకి వచ్చిన వారందరికీ డ్రగ్ పరీక్షలు జరిపారు. దీంట్లో 9 మంది గంజాయి సేవించినట్టుగా వెళ్లడయ్యిందని పోలీసులు తెలిపారు. అనుమతి తీసుకోకుండానే విదేశీ మద్యంతో పార్టీ ఇచ్చినట్టుగా తేలిందన్నారు.

ఈ నేపథ్యంలో మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ (Tripura Resort) జీఎం శివరామకృష్ణ, దామోదర్ రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావత్, రామకృష్ణ తదితరులపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలు జరుపుతున్నప్పుడు పోలీసులు వీడియో రికార్డింగ్ చేస్తుండగా మంగ్లీ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. రికార్డింగ్ ఆపండి అంటూ ఆమె గద్దించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, పోలీసులు సైతం అంతే ఘాటుగా ఆమెకు సమాధానం ఇచ్చి వారి పని వారు చేసుకుంటూ పోయారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో రచ్చ రచ్చ అవుతోంది.

Also Read- Thammudu Trailer: మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. అదే మనిషి పోయి మాట బతికితే..!

కేక్ కట్ చేయగానే వెళ్లిపోయా: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
మంగ్లీ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న గేయ రచయిత కాసర్ల శ్యామ్ స్పందించారు. ఈ పార్టీకి తాను హాజరైనట్టు తెలిపారు. కేక్ కట్ చేసే వరకు ఉండి ఆ తర్వాత తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని పేర్కొన్నారు. డ్రగ్స్ విషయం తనకు తెలియదన్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, అలాంటి వాటికి తాను దూరం అని తెలిపారు.

నా ఫొటోలు చూపించి, నా కెరీర్ నాశనం చేయవద్దు: దివి (Divi Vadthya)
ఈ పార్టీకి హాజరైన దివి కూడా ఓ ఆడియో మెసేజ్‌ని విడుదల చేశారు. ఇందులో, ‘మీ స్నేహితులు బర్త్‌డే పార్టీకి పిలిస్తే మీరు ఎలా అయితే వెళ్తారో.. అలానే నేను కూడా వెళ్లాను. బర్త్‌డే పార్టీ అనే మేము వెళ్లాం. అక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలియదు కదా. అక్కడి మిస్టేక్స్‌‌ను మాపై రుద్దవద్దు. అక్కడ నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే, అప్పుడు నా ఫొటో వేసి వార్తలు రాయండి. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నా ఫొటో వేసి, నెగిటివ్‌గా రాస్తున్నారు. దయచేసి అలా చేయకండి. అది నా కెరీర్‌పై ప్రభావం చూపుతుంది. మంగ్లీ స్నేహితురాలు కావటంతో పార్టీకి వెళ్ళాను. డ్రగ్స్ విషయం నాకు తెలియదు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. దయచేసి నాపై వార్తలు రాసే ముందు ఒక్కసారి ఆలోచించి రాయండి. నా ఫొటోలు వాడకండి ప్లీజ్’’ అని మీడియాను కోరారు.

Also Read- Suchata Chuangsri: సుందరీమణుల పోటీలపై వివాదాలు.. మిస్ మ్యాగి సైతం!

నేను ఆ పార్టీలో పాల్గొనలేదు: రచ్చ రవి (Racha Ravi)
‘‘మీడియా ప్రతినిధులకు, మంగ్లీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలలో నా ప్రస్తావన కూడా వస్తున్నందుకు నేను ఈ వివరణ ఇస్తున్నాను. అసలు నేను ఆ పార్టీకి హాజరు కాలేదు. నాకు, ఆ పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదు. కొన్ని రోజులుగా నేను నా షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నాను. నా కుటుంబాన్ని చూడడానికి కూడా నాకు తీరిక లేనంత బిజీగా ఉన్నాను. అలాంటిది, ప్రస్తుత సంఘటనలో నా పేరు ప్రస్తావన వస్తుండటం చూసి ఆశ్చర్యపోయాను. మీడియాపై ఉన్న గౌరవంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవాలను ధృవీకరించిన తర్వాతే.. ఇలాంటి వాటిపై చర్చలు జరిపితే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరోసారి అందరికీ చెబుతున్నాను. నేను మంగ్లీ బర్త్‌డే పార్టీలో భాగం కాలేదు. అందరికీ థ్యాంక్స్’’ అని రచ్చ రవి వివరణ ఇచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!