Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. అదిగో.. ఇదిగో అంటూ చెప్పినా సూపర్ సిక్స్‌లోని (Super Six) హామీలు ఒక్కొక్కటిగా అమలు అవుతూ వస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా గురువారం నాడు తల్లులకు కానుకగా ‘తల్లికి వందనం’ (Thalliki Vandhanam) పథకం అమలు చేయాలని నిర్ణయించారు. జూన్-12న ‘తల్లికి వందనం’ నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం అమలు కానుంది. వీరందరికీ రేపు.. ఖాతాల్లో నిధులు జమ చేయనున్నది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించనుంది. ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనున్నది.
Read Also- YSRCP: సజ్జలకు మూడినట్టేనా.. అరెస్ట్ తప్పదా?
ఎవరెవరికి?
1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు కానుంది. అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదల కానుంది. కాగా, ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం. తద్వారా వారు తమ పిల్లలను పాఠశాలలకు పంపడాన్ని ప్రోత్సహించడం, పాఠశాల హాజరును పెంచడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఈ పథకం కింద, ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ప్రభుత్వం రూ. 15,000/- ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ డబ్బును తల్లి నేరుగా అందుకుంటుంది, ఆమె తన పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు.
ఎందుకీ పథకం?
పిల్లలు పాఠశాలలకు క్రమం తప్పకుండా వచ్చేలా ప్రోత్సహించడం కోసం, పేద కుటుంబాలపై విద్యకు సంబంధించిన ఆర్థిక భారాన్ని తగ్గించడం, తల్లిదండ్రులలో, ముఖ్యంగా తల్లులలో, తమ పిల్లల విద్య పట్ల ఆసక్తిని పెంచడం, మధ్యలోనే చదువు ఆపేసే వారి సంఖ్యను తగ్గించడం కోసం ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కాగా, విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతూ ఉండాలి. విద్యార్థి తల్లి ఈ పథకానికి అర్హురాలు. కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెంది ఉండాలి. ఈ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు, వారి కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. పాఠశాలల నుంచి విద్యార్థుల డేటాను సేకరించి, పై పనులు పూర్తి చేసిన అర్హులను గుర్తించి, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తారు. ఏమైనా సందేహాలుంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించవచ్చు.
Read Also- YS Jagan: ప్రధాని మోదీపై ప్రేమ అస్సలు తగ్గలేదుగా!