Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న పాఠశాలను, రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలతో ప్రత్యేక అధికారులు సందర్శించి బడులకు సిద్ధంగా ఉంచేందుకు పనులను పర్యవేక్షించారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా కలెక్టర్ మంగళవారం మండల ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ…. గత వారం రోజుల నుండి మండల స్థాయి ప్రత్యేక అధికారులకు ఎడ్యుకేషన్, హెల్త్, సానిటేషన్, న్యూట్రీషలపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ఆదేశాలు జారీ చేశామని, అందులో భాగంగానే రానున్న రెండు మూడు రోజుల్లో పాఠశాలలు పునర్ ప్రారంభం నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలు లలో ప్రత్యేక సానిటేషన్ నిర్వహించాలని అందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పై అంశాలను పరిశీలించి తనిఖీ చేయాలని ఆదేశించారు.
Also Read: MLA Satyanarayana’s Wife: భర్తకు మంత్రి పదవి ఇవ్వలేదని.. ఎమ్మెల్యే భార్య ఫైర్.. ఎక్కడంటే?
పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్
ప్రభుత్వం పిల్లలకు అందించే విద్యలో అత్యున్నత ప్రమాణాలతో విద్య బోధనలు అందించాలని, అందుకు పరిసర ప్రాంతాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం లో మార్పులు వస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్య, విషజ్వరాలు ప్రబలకుండా గ్రామాలు ,పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ నిర్వహించి ముందస్తు వైద్య శిబిరాలను నిర్వహించాలని సమస్యత్మక ప్రాంతాలను గుర్తించి వారికి అంటువ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న బలవర్ధకమైన న్యూట్రిషన్ ఫుడ్ పక్కాగా అమలు చేయాలని నూతనంగా తెలిపిన సూచనల ప్రకారం మెనూ పాటించాలన్నారు.
శానిటేషన్లను పరిశీలించి, సిద్ధం
జిల్లాలోనీ (18) లలో ప్రత్యేక అధికారులు ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యాసంస్థలు, వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, తదితర ప్రదేశాలలో జరుగుతున్న శానిటేషన్లను పరిశీలించి, సిద్ధం చేస్తున్నామన్నారు. మండలాల్లో ప్రత్యేక అధికారులు పర్యటించిన వివరాలు.. గూడూరు, కురవి, కొత్తగూడ, మహబూబాబాద్, డోర్నకల్, దంతాలపల్లి, గంగారం, మరిపెడ, చిన్న గూడూరు, నరసింహుల పేట, పెద్ద వంగర, సీరోలు, తొర్రూరు మండలాల్లోని వివిధ పాఠశాలలు, రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను ప్రత్యేక అధికారులు సందర్శించి పారిశుద్ధ్య పనులు, పాఠశాలలకు వేస్తున్న రంగుల కార్యక్రమాలను పర్యవేక్షించారు.
Also Read: Honeymoon Case: భర్తను చంపేశాక.. వెలుగులోకి ‘సోనమ్’ క్రిమినల్ ఆలోచనలు