Bharat Bandh: చతిస్గడ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్‌లో భద్రతా బలగాలు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులకు నిరసనగా ఆ పార్టీ జూన్ 10వ తేదీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. జూన్ 9న మావోయిస్టులు చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పోలీసుల వాహనాన్ని ఐఈడీలతో పేల్చివేయడంతో కుంట ఏఎస్పి ఆకాశరావు మృతి చెందగా డి.ఎస్.పి, కుంట సిఐలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మావోయిస్టుల భారత్ బంద్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.
వాహనాలపై నిఘా
ఈ నేపథ్యంలో ఛత్తీస్గడ్ సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చతిస్గడ్ వైపు నుంచి తెలంగాణ వైపు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చత్తీస్గడ్ వైఫ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు అనుమానస్పద వ్యక్తులు, వాహనాలు చొరబడకుండా నిఘాతో వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు సృష్టించకుండా పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
Also Read: Hyderabad Metro: ప్రమాదంలో మెట్రో ట్రాక్? భద్రతపై నీలినీడలు!
రెండు రాష్ట్రాల సరిహద్దులు
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వాహనాల తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అపరిచిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
Also Read: Nara Lokesh: ప్రైవేటు రంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం!