Pawan Kalyan: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన చిత్రాలలో అన్నిచిన్న హీరో చిత్రాలే ఉన్నాయి. 2025లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ కొన్ని నెలల్లో జరగనుంది. అయితే, ఈ సారి దసరా పండుగకు ఇద్దరు స్టార్ హీరో చిత్రాలు పోటీ పడనున్నాయి. వాటిలో ఒకటి పవర్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ కాగా.. ఇంకోటి నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం. ఈ రెండు చిత్రాలు కూడా 2025 సెప్టెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు రానున్నాయి.
Also Read: Akhil Akkineni: నాగార్జున పెళ్లి బట్టల సెంటిమెంట్ ను అఖిల్ కూడా ఫాలో అయ్యాడా.. అంత రిస్క్ చేశారా?
యంగ్ డైరెక్టర్ వహిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఓజీ మూవీ. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రియా రెడ్డి కీలక పాత్రను పోషిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్మెంట్స్ పై దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై పవన్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలే ఉన్నాయి.
Also Read: Thummala Nageswara Rao: కమిషన్‌కు ఈటల చెప్పిందంతా అబద్దం.. నా పేరు ఎందుకు తీశారు.. తుమ్మల ఫైర్!
అఖండ మూవీకి సీక్వెల్‌గా అఖండ 2 సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ఈ మూవీ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్స్ ప్లస్ పతాకం పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు ఈ మూవీని నిర్మిస్తుండగా నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు. ఈ మూవీకి కూడా తమన్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు.