Akhil Akkineni: నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం జరిగిన విషయం మనకీ తెలిసిందే. జూన్ 6 న బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3:35 నిమిషాలకు జైనాబ్ మెడలో మూడు ముళ్ళు వేశారు. ఈ నేపథ్యంలోనే అమల- నాగార్జున పెళ్లి వేడుకకు సంబంధించిన పాత ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం, ఈ ఫొటో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది.
అయితే, ఈ ఫొటోలో అమల- నాగార్జున ధరించిన పెళ్లి బట్టల పైన అందరి దృష్టి పడింది. వీరు వేసుకున్న వివాహ వస్త్రాల్లో ఎవరికీ తెలియని నిజం ఒకటి ఉంది. 33 ఏళ్ల క్రితం అమల- నాగార్జున ఎలాంటి పెళ్లి బట్టలైతే ధరించారో.. ఇప్పుడు అఖిల్- జైనాబ్ లు కూడా అలాంటి వివాహ వస్త్రాలనే ధరించడం గమనార్హం.
Also Read: Suniel Narang: ‘హరి హర వీరమల్లు’ ఎఫెక్ట్.. టిఎఫ్‌సిసి అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా!
నాగార్జున తెల్లటి వస్త్రాలు ధరించగా.. అమల క్రీమ్ కలర్ శారీని ధరించారు. అయితే, అప్పుడు వీరిద్దరూ.. ఎలాంటి బట్టలైతే ధరించారో.. ఇప్పుడు అఖిల్ వైట్ షర్ట్, పంచె ధరించారు. అంతే కాకుండా, పూల దండలు కూడా సేమ్ గానే ఉన్నాయి. ఈ ఫొటో వైరల్ కావడంతో.. ఇది చూసిన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది కావాలనే ప్లాన్ చేసుకున్నారా? అనుకోకుండా ఇలా జరిగిందా? లేదా అఖిల్- జైనాబ్ గుర్తుగా ఇలా డిజైన్ చేయించుకున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి.