Sri Sathya Sai District: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రామగిరికి చెందిన ఓ మైనర్ బాలికపై ఏకంగా 13 మంది అత్యాచారం చేశారు. బాలికపై గత రెండేళ్లుగా ఈ దారుణం జరుగుతుండగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని రిమాండ్ కు తరలించారు. మిగిలిన ఏడుగురి కోసం గాలిస్తున్నారు.
నిందితుల్లో రౌడీ షీటర్
బాలికపై అఘాత్యానికి పాల్పడ్డ నిందితుల్లో మైనర్ల నుంచి 51 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. అందులో ఒకరు రౌడీ షీటర్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత బాలికపై ఆమె క్లాస్ మేట్స్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఎస్పీ చెప్పారు. అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులు నాగరాజ్(51), సంజీవ (40), రాజన్న(49), వర్ధన్ (21), తలారి మురళి (23), నందవర్ధన్ రాజ్(25) గా పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులు హేమంత్, గిరి, అంజి, రాజేష్, మురళి కార్తీక్ మరికొంత మందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ రత్న స్పష్టం చేశారు.
Also Read: HC Lawyer Kidnap case: హైకోర్టు న్యాయవాది కిడ్నాప్.. కోటి రూపాయలు డబ్బులు డిమాండ్!
పలుమార్లు దారుణం
గత రెండేళ్లుగా మైనర్ బాలికపై లైంగిక దాడి జరుగుతున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. బాధితురాలు 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి నిందితులు లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియోలు తీసి బెదింరిపులకు పాల్పడి బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారని.. వేర్వేరు సమాయాల్లో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలోను బాలిక గర్భం దాల్చితే నిందితులు అబార్షన్ చేయించారని చెప్పారు. పోలీసుల వద్దకు వెళ్లనివ్వకుండా బాలికను బెదిరించారని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి రామగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.