Jr NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ లిస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఈ హీరో అందరితో చాలా సరదాగా మాట్లాడుతుంటారు. ఎక్కువగా ఫ్యామిలీ, రిలేషన్ షిప్, స్నేహానికి ఎక్కువ విలువను ఇస్తుంటారు. అయితే, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సెలబ్రిటీలు వీరే! ఫొటోలు వైరల్
సీనియర్ నటుడు అశోక్ కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే, తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించాడు.
Also Read: Thummala Nageswara Rao: కమిషన్‌కు ఈటల చెప్పిందంతా అబద్దం.. నా పేరు ఎందుకు తీశారు.. తుమ్మల ఫైర్!
నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీతో మంచి స్నేహం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తో నేను సినిమాలు చేయనప్పటికీ.. ఆయన నాకు బాగా తెలుసు. ఎందుకంటే, ఎన్టీఆర్ వాళ్ళ బాబాయ్ ఆర్టిస్ట్ రాజా, నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. రాజా వైఫ్, ఎన్టీఆర్ అమ్మ అక్కా చెల్లెళ్లు అవుతారు. రాజా తో ఫ్రెండ్షిప్ వలన .. అలా ఎన్టీఆర్ కూడా సినిమాల్లోకి రాక ముందు నుంచే తెలుసు.
రాజా చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబ బాధ్యతను ఎన్టీఆర్ తీసుకుని ఎంత చేయాలో అంత చేశాడు. ఈ విషయం ఇంత వరకు బయటకు రాలేదు. ఇంకా చెప్పాలంటే రాజా ఇద్దరి కూతుళ్ళకు ఎన్టీఆరే దగ్గరుండి పెళ్లి చేశాడు.” అని అశోక్ కుమార్ ఎమోషల్ అవుతూ చెప్పుకొచ్చారు.