Shobana
ఎంటర్‌టైన్మెంట్

Shobana: నటి శోభనకే ఇలాంటి అవమానమా! సెట్‌లో బిగ్ బి లేకపోయి ఉంటే?

Shobana: నటి శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీసెంట్‌గానే కళా రంగానికి ఆమె చేసిన కృషికిగానూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన శోభన, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు, నటనకు దూరంగా ఉన్నారు. కళార్పణ అనే సంస్థను స్థాపించి భరతనాట్యంలో శిక్షణతో పాటు భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహిస్తు వస్తున్నారు. రీసెంట్‌గానే ఆమె మళ్లీ నటనవైపు అడుగులు వేశారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అలాగే రీసెంట్‌గా వచ్చిన మోహన్‌లాల్ ‘తుడరుమ్’లోనూ ఆమె ఆయనకు భార్యగా నటించారు. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

Also Read- Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సెలబ్రిటీలు వీరే! ఫొటోలు వైరల్

ఈ చిట్ ఛాట్‌లో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆసక్తికర విషయం అనేకంటే.. తన లైఫ్‌లో ఎదురైన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ప్రస్తావనను ఓ నెటిజన్ తీసుకురాగా, ఆయనను శోభన ప్రశంసలతో ముంచెత్తారు. ‘కల్కి’ కంటే ముందే అమితాబచ్చన్ సినిమాలో యాక్ట్ చేశానని, ఆ సమయంలో బిగ్ బి తన కోసం ఎలా నిలబడ్డారో శోభన చెప్పుకొచ్చారు. నిజంగా ఆమె చెప్పిన ఆ చేదు సంఘటనను వింటుంటే.. శోభన వంటి వారికే అలా జరిగితే.. మిగతా ఆర్టిస్ట్‌ల పరిస్థితేంటి? ఆరోజు సెట్‌లో బిగ్ బి అమితాబ్ లేకపోయి ఉంటే.. శోభన నటిగా కొనసాగేదేనా? ఒక గొప్ప నటి, నటించకుండానే.. వేరే వృత్తిని చూసుకునేదేమో.. అనేలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శోభన అమితాబ్ గురించి ఏం చెప్పారంటే..

Also Read- NTR: నాడు ‘నందమూరి’ నాటిన మొక్క.. నేటికీ సిరుల పంట

‘‘అమితాబ్‌ సార్ ఎంతో మంచి వ్యక్తి. అప్పుడేలా ఉన్నారో.. ఇప్పుడు కూడా ఆయన ఏమీ మారలేదు. మానవత్వం ఉన్న గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కంటే ముందే.. అంటే కొన్నేళ్ల క్రితమే ఆయనతో నేనొక ప్రాజెక్ట్‌‌లో నటించాను. ఆయన హీరోగా నటించిన సినిమాలో ఒక పాటకు డ్యాన్స్‌ చేసే అవకాశం నాకు వచ్చింది. అహ్మదాబాద్‌లో సాంగ్‌ని షూట్ చేశారు. ఆ సాంగ్‌లో నేను చాలా కాస్ట్యూమ్స్‌ మార్చుకోవాల్సి ఉంది. కానీ నాకు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు. మరో వైపు హీరో కోసం ప్రత్యేకంగా కారవాన్‌ తెప్పించారు. ఆయనని చూసేందుకు అహ్మదాబాద్‌ ప్రజలు భారీ సంఖ్యలో ఆ సెట్‌‌కి వచ్చారు. నేను దుస్తులు మార్చుకోవాల్సి రావడంతో.. ‘నా కారవాన్‌ ఎక్కడ?’ అని చిత్ర టీమ్‌ని అడిగాను. ఆ టీమ్‌లోని ఓ వ్యక్తి.. ‘ఆమె కేరళ నుంచి వచ్చింది. అక్కడివాళ్లు దేనికైనా సర్దుకుపోతారు. ఆమె ఆ చెట్ల వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకుంటుందిలే..’ అని అన్నాడు. ఆ మాటలు అమితాబ్‌ సార్ వాకీ టాకీలో విన్నారు. ఒక్కసారిగా ఆయనకు కోపం వచ్చేసింది. వెంటనే ఆయన కారవాన్‌ నుంచి బయటకు వచ్చి ఆ మాట అన్నటువంటి వ్యక్తిపై తిట్టేశారు. తన కారవాన్‌ను నాకు ఇచ్చి నన్ను డ్రస్ ఛేంజ్ చేసుకోమన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలకు ఆయన ఎంతగానో విలువ ఇస్తారు. మళ్లీ ‘కల్కి’ రూపంలో ఆయనతో కలిసి వర్క్‌ చేసే అవకాశం వచ్చింది’’ అని బిగ్ బి గొప్పతనాన్ని శోభన చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది