Congress Party: మంత్రి వర్గం లో చోటు కోసం ప్రయత్నించిన ఆశావహులను కాంగ్రెస్ పార్టీ బుజ్జగిస్తున్నది. ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కీలక నేతలంతా అసంతృప్తులను కూల్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డిలతో ఏఐసీసీ ఇన్ చార్జీ , పీసీసీ చీఫ్ లు బుజ్జగింపులు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ, ప్రభుత్వంలో ప్రయారిటీ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. సామాజిక వర్గాల సమతుల్యతలో భాగంగా విస్తరణలో కొందరికి అవకాశం లభించిందని, రాబోయే రోజుల్లో పార్టీ, సర్కార్ లోనూ కీలక పదవులు కేటాయిస్తామని భరోసా కల్పిస్తున్నారు.
పరిస్థితులను అర్ధం చేసుకోవాలని, పదేళ్ల పాటు పార్టీ పవర్ లో ఉండాల్సిన అవసరం ఉన్నదని అసంతృప్తులను కోరుతున్నారు. నేతలంతా సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం సజావుగా ముందుకు సాగుతుందని స్పష్టం చేస్తున్నారు. తప్పనిసరిగా కేబినెట్ పై పెట్టుకున్న ఆశలకు సరిసమానంగా ఇతర పదవుల్లో కొందరిని అలకేట్ చేస్తామని, మిగతా మూడు బెర్త్ లలో ఇంకొందరికి ఛాన్స్ లు వస్తాయని ఏఐసీసీ ఇన్ చార్జీ, పీసీసీ చీఫ్ లు క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఆయా నేతల మాత్రం తమ స్పందనను అధికారికంగా వ్యక్తం చేయడం లేదు. కేడర్ తో చర్చించి ఆలోచిస్తాం అంటూ కొందరు నేతలు ఏఐసీసీ ఇన్ చార్జీ, పీసీసీ చీఫ్ కు వివరించడం గమనార్హం.
Also Read: Chandrababu Naidu: ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే.. ఏపీ ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు!
క్యాస్ట్ ఈక్వేషన్స్ కే ప్రయారిటీ..?
కేబినెట్ విస్తరణలో తమకు తప్పనిసరిగా అవకాశం లభిస్తుందని ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లు గట్టి నమ్మకం పెట్టుకున్నారు. దీంతో పాటు విజయశాంతి, మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, అద్దంకి దయాకర్, అమీర్ అలీఖాన్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మదన్ మోహన్ రావు వంటి నేతలకు కూడా జిల్లా, క్యాస్ట్, స్థానిక పొలిటికల్ సమీకరణాల్లో తమకు ఛాన్స్ వస్తుందని ఎదురుచూశారు. వీరిలో కొందరు హైకమాండ్ కూ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఏఐసీసీ పెద్దలతో సిఫారసులు కూడా చేయించుకున్నారు. మంత్రులు కూడా పలువురు నాయకులకు మద్ధతు పలికారు. కానీ అధిష్టానం సామాజిక న్యాయం కోణంలోనే బీసీ, ఎస్సీలకు విస్తరణలో కల్పించింది. దీంతో ఆయా నేతలంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆ నేతల మదిలో ఏమున్నదో..?
నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి కన్ఫామ్ గా బెర్త్ ఖరారు అవుతుందనే ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సపోర్టు మెండుగా ఉన్నదని పార్టీ వర్గాలు కూడా ప్రచారం చేశాయి. కానీ రెడ్డి మంత్రులు ఇప్పటికే ఎక్కువ మంది ఉన్నారనే భావనతో ఆ పేరు ను పక్కకు పెట్టారు. రాజగోపాల్ రెడ్డి పరిస్థితీ అంతే. వాస్తవానికి ఎంపీ ఎన్నికల సమయంలో మంత్రి పదవి హామీ నేరుగా కేసీ నుంచి రాజగోపాల్ రెడ్డికి లభించింది. ఆయనకు పక్కా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. లిస్టులో ఆయన పేరు లేదు.
రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పట్టుబట్టారు. ఈయనకూ రెడ్డి ఈక్వేషన్ లోనే మంత్రి పదవి తప్పినట్లు గాంధీభవన్ లో చర్చ .ప్రేమ్ సాగర్ రావుకు డిప్యూటీ సీఎం సపోర్టు చేసినా, కేబినెట్ లోకి అవకాశం రాకపోవడం గమనార్హం. ఇక డిప్యూటీ స్పీకర్ తనకే వస్తుందని భావించిన బాలు నాయక్ కూడా ఖంగుతిన్నారు. వీళ్లందరినీ ఏఐసీసీ, పీసీసీ కో ఆర్డినేట్ చేస్తూ బుజ్జగింపులు చేస్తున్నా..ఏ నేత ఎలాంటి స్టెప్ తీసుకుంటారని ఆందోళన కూడా ఉన్నది. ఈ అసంతృప్తి రాగం ఎక్కడికి వరకు దారితీస్తుందోనని పార్టీ వర్గాల్లో బిగ్ డిస్కషన్.
Also Read: Mahesh Kumar Goud: ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు.. పీసీసీ చీఫ్ సంచలన వాఖ్యలు!