Mahesh Kumar Goud: మంత్రి వర్గంలో మిగిలిన మూడు స్థానాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామన్నారు. మిగతా బెర్త్ ల భర్తీలోనూ అన్ని ఈక్వేషన్స్ పాటిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నదన్నారు. ప్రజాప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వివరించారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి, డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్ కూడా పీసీసీ చీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన చేప ప్రసాదం పంపిణీని ఆదివారం పీసీసీ చీఫ్ ప్రారంభించారు.
Also Read: CM Revanth Reddy: కిషన్ రెడ్డి సహకరిస్తే .. తెలంగాణను పరుగులు పెట్టిస్తా సీఎం కీలక వాఖ్యలు!
సంప్రదాయ వైద్యం చేప మందు
అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలంతా చేప ప్రసాదం మందును వినియోగించుకోవాలన్నారు. ఉబ్బసం బాధితులకు ఉపశమనం కలిగించే సంప్రదాయ వైద్యం చేప మందు అని వివరించారు. 178 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్న బత్తినీ కుటుంబం మానవతా సేవకు ఉదాహరణ అంటూ కొనియాడారు. బత్తినీ కుటుంబానికి పద్మశ్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
సంప్రదాయ వైద్యం పట్ల గౌరవం, విశ్వాసం అవసరం అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు తరలివస్తున్నారన్నారు. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఉచితంగా చేప మందును అందజేస్తున్న ప్రతి కుటుంబానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ లు పాల్గొన్నారు.
Also Read: Warangal Museum: మ్యూజియం కూలకుండా కర్రల సపోర్ట్.. ఓరుగల్లు చారిత్రాత్మక సంపదకు దిక్కేది..?