CM Revanth Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణను పరుగులు పెట్టిస్తానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ “ప్రజల కథే.. నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌలీగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు దత్తత్రేయది సుదీర్ఘ ప్రయాణమని కొనియాడారు. ఆయన జీవితంలో ఎన్నో పదవులు అధిష్టించినా, ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదన్నారు. దత్తాత్రేయ తో వ్యక్తిగతంలో తనకు సన్నిహితంగా ఉన్నదని సీఎం గుర్తు చేశారు. అజాత శత్రువు అనే పదం బండారు దత్తాత్రేయకు సరిగ్గా సరిపోతుందన్నారు.
Also Read: Young Man Dies: హనీమూన్‌కు వెళ్తున్న వేళ.. రైల్వే స్టేషన్‌లో విషాదం!
ఆయన్ను చూసి నేర్చుకోవాలి
దేశ స్థాయిలో అటల్ బిహార్ వాజ్ పేయి, రాష్ట్రంలో బండారు దత్తాత్రేయలు గొప్ప వ్యక్తులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. పదవిలో ఉన్నా, లేకున్నా, దత్తాత్రేయను రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తారని వివరించారు. దీనికి నిదర్శనమే ఆయన నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం అని పేర్కొన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారు ఆయన్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. జంట నగరాల్లో పేదలకు కష్టం వచ్చినప్పుడు గుర్తేచ్చే నాయకుల్లో పీజేఆర్, దత్తాత్రేయలు మాత్రమే అని చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో పీజేఆర్, దత్త్రేలు స్పూర్తి తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక తన స్కూలింగ్ అంతా మోడీ దగ్గరైతే, కాలేజీ చంద్రబాబు, ఉద్యోగం చేస్తున్నది రాహుల్ దగ్గర అంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు ,శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఇతర నేతలు హాజరయ్యారు.
Also Read: Warangal Museum: మ్యూజియం కూలకుండా కర్రల సపోర్ట్.. ఓరుగల్లు చారిత్రాత్మక సంపదకు దిక్కేది..?