Bonalu Festival: ఆషాఢ మాసం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు పాటిస్తారు. ఈ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణ లో అమ్మవార్లకు.. గ్రామదేవతలకు భోజనం సమర్పిస్తారు. దీన్నే ‘బోనాలు’ అంటారు. ఆషాఢ మాసంలో బోనాలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. గ్రేటర్ లో వైభవోపేతంగా నెల రోజుల పాటు బోనాల కార్యక్రమం చేపడ్తారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రజల సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ ఆషాఢ బోనాలకు 20 కోట్లు కేటాయించింది. ఆలయాల వద్ద భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఆలయలకు గ్రేడ్లను బట్టి నిధులను దేవాదాయశాఖ మంజూరు చేస్తున్నట్లు సమాచారం.
మహంకాళి ఆలయంలో తొలుత బోనాలు
గ్రేటర్ లో ఈ నెల 26 నుంచి ఆషాఢ బోనాల కార్యక్రమం ప్రారంభమౌతుంది. గోల్కొండ జగదాంభ మహంకాళి ఆలయంలో తొలుత బోనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. గ్రేటర్ లో ప్రముఖ ఆలయాలు 28 ఉన్నాయి. ఈ ఆలయాల పరిధిలో ఎప్పుడు బోనాలు నిర్వహించాలి.. ఆ పూజల్లో ఎవరు అతిధులుగా పాల్గొంటారనేది దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్లు లిస్టు తయారు చేస్తున్నట్లు సమాచారం. అందుకు ప్రకారంగానే ఆయా ఆలయాల్లో బోనం ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: MLA Maganti Gopinath: ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి.. కన్నీంటి పర్యంతమైన గులాబీ అధినేత కేసీఆర్!
భక్తులకు తాగునీరు
గతేడాది జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆలయాలకు వచ్చే భక్తులకు తాగునీరు, క్యూలైన్లు, బోనం సమర్పణ సమయంలో ఇబ్బందులు కలుగకుండా సిబ్బంది ఏర్పాటు, చలువ పందిళ్లు, ఆలయం వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రణాళికలు, ట్రాఫిక్ ఆంక్షలు, పూజా కాంకైర్యాలకు సంబంధించిన ప్లాన్ లు రూపొందిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, కమిషనర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒకటిరెండ్రోజుల్లో ఆలయ అధికారులతో రివ్యూలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అధికారులకు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది.
ఉజ్జిణి మహంకాళి ఆలయంలో జూలై 13, 14
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జూలై 1వ తేదీన బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 20, 21 తేదీల్లో లాల్ దర్వాజాలోని సింహవాహిణి మహంకాళి ఆలయంలో భోనాలు, నాచారం లోని మహంకాళి సమేతమహంకాళేశ్వర ఆలయంలో జూలై 20న బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జిణి మహంకాళి ఆలయంలో జూలై 13, 14 తేదీల్లో బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
Also Read: Rangareddy: మల్‌రెడ్డికి బెర్త్ దక్కకపోవడానికి.. సామాజిక వర్గమే అడ్డొచ్చిందా?