NBK111: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ప్రస్తుతం టాప్ రేంజ్‌లో దూసుకెళుతున్నారు. వరుస విజయాలతో తిరుగులేని హీరోగా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. ఆయన ఎంచుకునే సినిమాలు, కాన్సెప్ట్‌లు ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. వరుసగా మూడు సక్సెస్‌లతో బాక్సాఫీస్‌ని షేకాడించిన బాలయ్య.. తన తదుపరి చిత్రాల విషయంలోనూ అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా తన తడాఖా చూపిస్తున్నారు. జూన్ 10 బాలయ్య పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకు నందమూరి అభిమానులకు బాలయ్య అదిరిపోయే ట్రీట్స్ రెడీ చేశారు. అందులో ఒకటి ‘అఖండ 2’ టీజర్ కాగా, రెండోది ‘NBK111’ అప్డేట్. అవును, బాలయ్య నటించబోయే 111వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.
Also Read- Udaya Bhanu: ‘హరి హర వీరమల్లు’ పరువు తీసేసిన యాంకర్ ఉదయభాను.. వీడియో వైరల్!
నటసింహం బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని అదిరిపోయే సర్‌ప్రైజ్ ఆల్రెడీ వచ్చేసింది. బాలయ్య 111వ చిత్రానికి దర్శకుడెవరో తెలిసిపోయింది. పుట్టినరోజుకు రెండు రోజుల ముందే ‘NBK111’ చిత్ర అప్డేట్ వదిలి నందమూరి అభిమానులను ఖుషి చేశారు. ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను బాలయ్యకు ఇచ్చిన గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో ‘NBK111’ చిత్రం ఉండబోతుందని తెలుపుతూ అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సింహానికి మాస్క్ వేసి.. ఈ సినిమా కూడా గర్జించేలా ఉంటుందని సింబాలిక్‌గా రివీల్ చేశారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.
Also Read- Samantha: నాగ చైతన్య నా ఫస్ట్ లవ్ అంటూ మళ్లీ ఓపెన్ అయిన సమంత
‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. నటసింహంతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రమవుతుంది’’ అని గోపీచంద్ మలినేని చేసిన ట్వీట్‌తో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బాలయ్య మాస్ పల్స్‌ని బాగా పట్టేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆ విషయం ‘వీరసింహారెడ్డి’తోనే ప్రూవ్ చేశాడు. బాలయ్యని ద్విపాత్రాభినయంలో ఆయన చూపించిన తీరు, డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్.. ఇలా ఒకటా, రెండా.. సినిమా మొత్తం ఫ్యాన్స్‌కి ట్రీట్‌గా మార్చేసి.. దర్శకుడిగా బాలయ్య మదిలో స్థానం సంపాదించుకున్నాడు. అందుకే, ఈసారి కథ వినకుండానే బాలయ్య ఈ సినిమాను ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాను బాలయ్య పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో చేస్తున్న ‘అఖండ 2’ చిత్ర షూటింగ్ పూర్తవ్వగానే.. ‘NBK111’ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరో వైపు ‘అఖండ 2’ మూవీ టీజర్‌కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ని సోమవారం (జూన్ 9) సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు