Dhoop Deep Naivedyam Scheme( image credit: twitter)
తెలంగాణ

Dhoop Deep Naivedyam Scheme: 250 ఆలయాలకు.. ప్రభుత్వం నోటిఫికేషన్!

Dhoop Deep Naivedyam Scheme: రాష్ట్రంలో ఆదాయం లేని ఆలయాల్లో నిత్యం పూజా కైంకర్యాలు కుంటుపడకుండా ఉండేందుకు వాటిలో పూజలు నిర్వహించేందుకు దేవాదాయశాఖ దూపదీప నైవేద్య పథకంను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆలయాలను ఎంపిక చేసి ఆ పథకం కింద 10వేల రూపాయలను ప్రతి నెల అందజేస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటేనే ఎంపిక చేసి పథకాన్ని వర్తింపజేస్తారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగానే దరఖాస్తులు భారీగా వచ్చాయి. దీంతో ఇంకా కొన్ని ఆలయాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ 250 ఆలయాలను డీడీఎన్​ పథకంలో ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్​ ఇచ్చింది. ఈ పథకం ద్వారా నిధులు సమకూర్చేందుకు అర్హులైన ఆలయాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు మే 24వ తేదీ వరకు గడువు విధించింది. గడువులోగా దాదాపుగా 3,300పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం 250 ఆలయాలను మాత్రమే దూపదీప నైవేద్యం పథకం కింద ఎంపిక చేస్తామని నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కోంది. అయినప్పటికీ ఊహించని విధంగా దరఖాస్తులు వచ్చాయి.

 Also Read: Young Man Dies: హనీమూన్‌కు వెళ్తున్న వేళ.. రైల్వే స్టేషన్‌లో విషాదం!

దీంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే విషయాన్ని ఏసీలు రాష్ట్ర కమిషనర్ తో పాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో కేవలం 25 ఆలయాల చొప్పున ఈ పథకంలో ఎంపికయ్యే అవకాశం ఉందని సమాచారం. డీడీఎన్ పథకానికి ఆలయాన్ని ఎంపిక చేయాలంటే విధిగా 15 ఏళ్లు దేవాదాయశాఖలో సంబంధిత ఆలయం రిజిస్ట్రార్ అయి ఉండాలి. ఆలయానికి ఆర్థిక వనరులు ఉండొద్దు. భక్తుల సంఖ్య, రెవెన్యూ సైతం తక్కువగా ఉన్న ఆలయాలను మాత్రమే ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు. జిల్లాల్లో ఏసీ (అసిస్టెంట్​ కమిషనర్లు) ఓకే చేసిన ఆలయాలకు మాత్రమే ఈ పథకం వర్తించనున్నది. అయితే వారిపై ఫిర్యాదు వస్తేమాత్రం ఎంక్వాయిరీ చేయనున్నట్లు సమాచారం.

అధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి
ప్రభుత్వం 250 ఆలయాలకు మాత్రమే డీడీఎన్ పథకం వర్తింపజేస్తామని స్పష్టంగా పేర్కొంది. అయితే ఆలయాలను ఈ పథకం కిందచేర్చితే సంబంధిత గ్రామాల్లో తమ ఇమేజ్ పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లోనూ తమకు బాసటగా నిలుస్తారని భావించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నిబంధనల కంటే తాము చెప్పిన ఆలయాలకు పథకం వర్తింపజేయాలని కోరుతున్నట్లు సమాచారం. అంతేగాకుండా కొంతమంది రిక్వెస్టు లెటర్ లు కూడా ఇస్తున్నట్లు తెలిసింది. అయితే, ఎండో మెంట్​ అధికారులు మాత్రం నిబంధనల మేరకే ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం దరఖాస్తులు ఎక్కువగా రావడంతో మరికొన్ని ఆలయాలను డీడీఎన్​ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలిసింది. ఎన్ని ఆలయాలనేది అప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

డీడీఎన్ పథకం కింద రూ.10 వేలు
రాష్ట్రంలో దేవాదాయ శాఖ ధూప దీప నైవేద్య పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హత కలిగిన ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆదాయం లేని ఆలయాల నిర్వహణ, సంప్రదాయ పూజల కోసం డీడీఎన్ పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పథకం కింద ఎంపికైన ఆలయాలకు నెలకు ప్రభుత్వం రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో అర్చకులకు గౌరవ భృతి, పూజా కార్యక్రమాల కోసం నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధుల్లో రూ.7,000 అర్చకులకు గౌరవ భృతిగా, రూ.3,000 ధూప, దీప, నైవేద్యం వంటి పూజా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. గతంలో ఈ పథకంలో రూ.6,000 (రూ.4,000 అర్చకులకు, రూ.2,000 పూజ సామగ్రి) కి కేటాయించారు. గత ప్రభుత్వం దీనిని రూ.10,000లకు పెంచింది.

 Also Read: Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!

ప్రస్తుతం 6,541 ఆలయాలు
ప్రస్తుతం రాష్ట్రంలో 6,541 ఆలయాల్లో డీడీఎన్ పథకంలో భాగంగా ప్రతినెలా రూ.6.54 కోట్ల నిధులు కేటాయిస్తున్నది. ఇప్పుడు మరో 250 ఆలయాలను ఈ పథకంలో ఎంపిక చేస్తే ప్రభుత్వానికి రూ.25 లక్షల వరకు అదనపు భారం పడనున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాలకు ఎలాంటి ఆదాయ వనరు ఉండదు. ప్రభుత్వం ఇచ్చే డీడీఎన్ నిధులే ఆసరాగా ఉంటాయి. కాగా, ఈ పథకంలో ఆలయం ఎంపిక కావాలంటే 15 ఏండ్ల క్రితం ఆలయం నిర్మించాలి. ఆలయం గ్రామీణ ప్రాంతంలోనే ఉండాలి. ఈ పథకం ద్వారా ఎంపికైన ఆలయాలకు దేవాదాయ శాఖ నిధులు కేటాయిస్తుంది. ఆలయాల సంప్రదాయాలను కాపాడేందుకు ఈ నిధులు దోహదం చేస్తాయి.

ఓ అధికారి చేతివాటం?
కొందరు అధికారుల నిర్వాకంతో దేవాదాయ శాఖ అపకీర్తిని ముటగట్టుకోవాల్సి వస్తుంది. రాజధానికి సమీప జిల్లాకు చెందిన ఓ ఏసీ (అసిస్టెంట్​ కమిషనర్​) ధూప, దీప నైవేద్య పథకానికి సంబంధించిన దరఖాస్తుల్లోనూ చేతివాటం ప్రదర్శించినట్లు ప్రచారం జరుగుతుంది. చెయ్యి తడపనిదే దరఖాస్తు ఇవ్వలేదని సమాచారం. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.10 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఏసీలు ఓకే అంటేనే దరఖాస్తులకు మోక్షం లభించనుండటంతో తప్పని పరిస్థితిలో దక్షిణ సమర్పించుకోవాల్సి వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది. ఇదెలా ఉంటే ఆ అధికారం మాత్రం ఉన్నతాధికారుల పేర్లు చెప్పి మరి వసూలు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఆ అధికారిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 Also Read: SP On Farmers: రైతులకు నష్టం కలిగించే వారిని ఉపేక్షించం.. ఎస్పీ వార్నింగ్!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..