Cm Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు నెరవేరుస్తూ వస్తున్నారు. అయితే సూపర్ సిక్స్ హామీలు ఇంకా కొన్ని పెండింగ్ లో ఉండటంతో ప్రజల్లో అసంతృప్తులు మెుదలైనట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ప్రజలు సానుకూలంగా లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. తన పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం ఏమన్నారంటే?
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు (CM Chandra Babu) ప్రజా ప్రతినిధులతో ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరు ఏం చేస్తున్నారన్న సమాచారం తన వద్ద ఉందని చంద్రబాబు అన్నారు. ప్రజలు మనల్ని గమనిస్తున్నారన్న విషయాన్ని ప్రజా ప్రతినిధులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. సరైన పని విధానాన్ని చూపించకపోతే మళ్లీ సీటు ఇవ్వడం కుదరదన్న సంకేతాలు ఇచ్చారు.
Also Read: Bollywood Queen: బిగ్ అప్డేట్.. అల్లు అర్జున్ తో రొమాన్స్ కి రెడీ అంటున్న బాలీవుడ్ క్వీన్ .. వీడియో వైరల్
ఏడాది పాలనపై దిశానిర్దేశం
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న అమరావతిలో భారీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఏడాదిలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. 2024 జూన్ కు ముందు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిందన్న సీఎం.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం – అభివృద్ధి సమపాళ్లుగా కొనసాగిస్తామని సీఎం అన్నారు. వచ్చే నెల ఆఖరికి అన్ని కమిటీల నియామకాలు పూర్తి కావాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు.