Bollywood Queen: పుష్ప 2 తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా తీస్తాడా అని ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల వారు కూడా ఎదురుచూశారు. అయితే, ఎట్టకేలకు ఆ ప్రశ్నకి సమాధానం దొరికేసింది. మొత్తానికి అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా రాబోతుంది. దీనికి సంబందించిన వీడియోలు కూడా బన్నీ పుట్టిన రోజున రిలీజ్ చేశారు.
Also Read: Harish Rao: తెలంగాణ గొంతు పిసికేస్తున్నారు.. కాళేశ్వరంతో నీళ్లిస్తే అభాండాలా.. హరీశ్ రావు
అయితే, తాజాగా ఈ మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అందరూ అనుకున్నదే నిజమైంది. ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనె కథానాయికగా నటించబోతుంది. ఇక ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఫస్ట్ గ్లింప్స్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు.
ఇటీవలే దీపికా తన పీఆర్ టీమ్ తో త్రిప్తిపై, తనపై అసత్య ప్రచారం చేయించి, స్పిరిట్ కథను మీడియాకు లీక్ చేసిందని సందీప్ వంగ ఆమె పేరు పెట్టకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది జరిగిన పది రోజులు కాకుండానే అల్లు అర్జున్ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా అనౌన్స్ చేయడం పెద్ద షాకింగ్ లాగా ఉంది.