Manchu Vishnu on Dil Raju: మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరియర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే, ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
దిల్ రాజు కూడా ఇలా బిహేవ్ చేస్తాడా?
ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మంచు విష్ణు సంగతి తెలిసిందే కదా.. మనసులో ఏది అనుకుంటే అది ఓపెన్ గా చెప్పేసాడు. ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారని కూడా ఉండదు. ఆయన మాట్లాడుతూ ” మీ ముగ్గురికి తెలియని ఏం కాదు. నాలుగు గోడల మధ్య ఎన్నో జరుగుతుంటాయి. ఇది బాగుంది.. సూపర్ హిట్టు.. బ్లొచ్క్ బస్టర్ అనుకున్న సినిమాలు ఆడియెన్స్ దగ్గరకు వెళ్లలేకపోవచ్చు. అలాగే, వారికి నచ్చకపోవచ్చు కూడా.. అలా టాలీవుడ్ లో కొన్నివందల సినిమాలు ఉన్నాయని అన్నారు.
దిల్ రాజు నా సినిమా చూసి బాగలేదని చెప్పాడు: మంచు విష్ణు
మంచు విష్ణు ఇంకా మాట్లాడుతూ ” 2006 నవంబర్ 23 న నా సినిమా ఢీ ఫస్ట్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో పడింది. ఏప్రిల్ 13 న 2007 కి సినిమా రిలీజ్ అయింది. ఈ మధ్యలో దాదాపు 100 షోలు ప్రసాద్ ల్యాబ్స్ లోనే పడ్డాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో సహా ఈ సినిమా యావరేజ్ అమ్మా.. ఇది పెద్దగా ఆడదని అని చెప్పి ఒక్కరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చెయ్యలేదు. ఇక చేసేదేమి లేక మా నాన్న మోహన్ బాబు తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు కూడా తెలుసు.. సినిమా ఎంత పెద్ద హీట్ అయిందో అని ” అన్నారు.
ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీన్ని చూసిన నెటిజన్స్ కూడా రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.