KTR Wife
సూపర్ ఎక్స్‌క్లూజివ్

KTR Wife: రాజకీయాల్లోకి కేటీఆర్ భార్య? కవితకు చెక్ పెట్టేందుకేనా?

KTR Wife: కేటీఆర్ భార్య శైలిమ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఒక్కసారిగా ఆమె తెరమీదకు వచ్చారు. కేసీఆర్ (KCR) కుటుంబం నుంచి మరొకరు వస్తున్నారనే పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్పత్రిలో ఉండటంతో మానిటరింగ్ చేయడం, చికిత్స వివరాలను అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌కు అప్‌డేట్ ఇస్తుండటంతో హాట్ టాపిక్‌గా మారారు. కేటీఆర్ విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ నేతలతో టచ్‌లో ఉంటూ రాజకీయ పరిణామాలను తెలుసుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ తరుణంలోనే పార్టీ ఎమ్మెల్యే మాగంటి (Maganti) ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన కుటుంబానికి భరోసా కల్పిస్తున్న తీరు పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లో ఆరంగ్రేటం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఆమెనే కేటీఆర్ భార్య శైలిమ. ఈమె కుటుంబానికి మాత్రమే పరిమితం అయ్యారు. అయితే, ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు.


ఎప్పటికప్పుడు ఆరా

పార్టీ కార్యకర్తకు అండగా ఉంటానని, ఏ ఒక్కరికి కష్టం వచ్చినా భరోసాగా ఉంటానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గానీ, ఇతర దేశాల్లోనూ పేదలకు కష్టం వచ్చినా, అక్కడ పడుతున్న ఇబ్బందులను కేటీఆర్ దృష్టికి నేతలు తీసుకెళ్తే స్పందిస్తూ వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. దుబాయ్, అమెరికాలో ఇబ్బందులు పడుతున్న వారికి సైతం అండగా నిలబడుతున్నారు. అవసరమైన వారికి న్యాయసాయం సైతం అందజేస్తున్నారు. ఈ తరుణంలోనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చాతినొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ అమెరికా నుంచి ఆయన ఆరోగ్య వివరాలను ఫోన్‌లో తెలుసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి భరోసా ఇస్తున్నారు. కేటీఆర్ అమెరికాలో ఉండటంతో నిన్నటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ మాగంటి కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా కేటీఆర్ భార్య శైలిమ నిలుస్తున్నారు. దీంతో కేటీఆర్ పేర్కొన్న విధంగా భరోసా ఇస్తుండటంతో ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎప్పటికప్పుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను కేటీఆర్‌కు శైలిమ వివరిస్తున్నారు.


Read Also- Notice to KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

తొలిసారి చర్చకు దారి

మాగంటి ఆరోగ్య పరిస్థితిపై శైలిమ వాకాబు చేస్తున్న విషయాన్ని మీడియాకు లీకులు ఇచ్చారు. అసలు సందర్భం ఏంటి? ఎందుకు ఇచ్చారనేది హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం రాజకీయాల్లో మార్పులకు అనుగుణంగా కేసీఆర్ కుటుంబం నుంచి శైలిమ రాజకీయాల్లోకి వస్తుందా? అనే ప్రచారం ఊపందుకున్నది. ఆమె రాజకీయాల్లోకి వస్తారా? లేకుంటే పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామనే భరోసా కల్పించేందుకే మీడియాకు తెలిపారా? అనేది చర్చకూడా జోరుగా సాగుతున్నది. మరోవైపు పార్టీలోని మహిళల దృష్టిని సైతం ఆకర్షించేందుకే శైలిమను రంగంలోకి దింపారా? అనేది కూడా చర్చజరుగుతున్నది. కవిత సైతం ఇప్పటికే రాజకీయంగా స్పీడ్ పెంచడం, మహిళా హక్కులపై పోరాటం బాట పట్టింది. ఆమెకు చెక్ పెట్టేందుకే శైలిమను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారా? అనే ది హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే కుటుంబ పార్టీగా

బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబానిదే పెద్దపీట. కేసీఆర్‌తో పాటు ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత, హరీశ్ రావు సైతం కీలక భూమిక పోషించారు. అయినప్పటికీ కుటుంబ పార్టీగా బీఆర్ఎస్ ముద్రపడింది. చర్చ సైతం అదే కొనసాగుతున్నది. ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్ కుమార్‌కు రాజ్యసభ పదవి ఇవ్వడంతో విమర్శలు వచ్చారు. మొత్తం ఐదుగురు సభ్యులు కుటుంబం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం శైలిమ సైతం రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నది. ఇప్పటికే పార్టీలోని రాజకీయ పరిస్థితులపైనా ఆరా తీస్తున్నారని సమాచారం. సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తారనే పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు శైలిమ రాజకీయాల్లోకి అసలు వస్తారా లేదా అనేది చూడాలి.

మాగంటితో ఆర్థిక సంబంధాలా?

ఎమ్మెల్యే గోపీనాథ్‌కు కేటీఆర్‌కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. అంతేగాకుండా కేటీఆర్ తనయుడు, గోపీనాథ్ తనయుడు ఇద్దరు మిత్రులు కావడంతో ఇంకా ఇరు కుటుంబాల మధ్య స్నేహబంధం ఉన్నట్లు సమాచారం. దీంతోనే శైలిమ ఆస్పత్రికి వెళ్లి మాగంటి ఆరోగ్యంపై ఆరా తీశారని కొంతమంది పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లి గోపీనాథ్ కుటుంబానికి భరోసా ఇవ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Read Also- Series of thefts: మంచితనం ముసుగులో.. వరుస దొంగతనాలు!

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?