Akhil Wedding: అక్కినేని ఇంట పెళ్లి సందడి చాలా సైలెంట్‌గా జరిగినా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు మాత్రం ఈ పెళ్లి ధూమ్ ధామ్‌గా జరిపించారనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అసలు ఈ పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయాన్ని పబ్లిక్‌కి తెలియనీయకుండా కింగ్ నాగార్జున బాగానే ప్లాన్ చేశారు. కానీ, హాజరైన సెలబ్రిటీల వీడియోలు, లోపల జరిగిన ఈవెంట్స్‌కు సంబంధించిన వీడియోలు మాత్రం లీకవుతూనే వచ్చాయి. ఇలా లీకైన వాటిలో.. కింగ్ నాగార్జున (King Nagarjuna) డ్యాన్స్ చేస్తున్న వీడియో మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. కింగ్ నాగ్ ఒక్కడే కాదు.. ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ (Akhil Akkineni)తో కలిసి మ.. మ.. మాస్ అనే లెవల్లో దుమ్ము రేపారు. పెద్ద కుమారుడు నాగ చైతన్య (Naga Chaitanya) మొదటి పెళ్లి అలా అవ్వడం, అఖిల్‌కు నిశ్చితార్థం జరిగి పెళ్లి ఆగిపోవడం వంటి వాటితో, తన కుమారుల విషయంలో నాగ్ కాస్త డిజప్పాయింట్‌గా ఉన్నట్లే కనిపిస్తూ వచ్చారు.
Also Read- King Nagarjuna: అఖిల్ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున.. ఏం చెప్పారంటే?
కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. నాగార్జునకు కూడా మంచి రోజులు వచ్చాయి. 5 నెలల క్రితం పెద్ద కుమారుడు నటి శోభితను రెండో పెళ్లి చేసుకుని, ఆమెతో ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు రెండో కుమారుడు అఖిల్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఒక తండ్రిగా ఇంతకంటే సంతోషం ఏముంటుంది. కుమారులకు పెళ్లి చేసినప్పుడే కదా.. పెద్దరికం అనేది తెలిసేది. ఆ పెద్దరికాన్ని నిలుపుకుని, కింగ్ నాగ్ పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఆ విషయం తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. తన వంశంలో మరో తరం దిగితే.. ఆ ఆనందం డబుల్ అవుతుంది. ఆ ఆనందాన్ని ఇద్దరు కొడుకులలో ఎవరు ముందు ఇస్తారనేది చూడాల్సి ఉంది.
Also Read- Single OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘సింగిల్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
ఇక అఖిల్ పెళ్లి విషయానికి వస్తే.. పెళ్లికి ముందు జరిగిన బరాత్ కార్యక్రమంలో కింగ్ నాగార్జున తన కుమారులతో కలిసి బిగ్ బి అమితాబచ్చన్ పాటలకు డ్యాన్స్ చేశారు. విశేషం ఏమిటంటే.. ఇద్దరు కొడుకుల కంటే కూడా కింగ్ నాగ్ అదిరిపోయేలా డ్యాన్స్ చేయడం. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ రిపీట్ మోడ్‌లో చూస్తూ.. వైరల్ చేస్తున్నారు. నాగార్జున ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు, కానీ ఈసారి ఆయన సంతోషానికి అవధులు లేవు. అందుకే అలా కుమారులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసి అలరించారు. పెళ్లి తర్వాత తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా నాగ్ పంచుకున్నారు. మా దంపతులిద్దరం ఈ పెళ్లితో సంతోషంగా ఉన్నామని తెలిపారు. అఖిల్ పెళ్లి జైనాబ్‌తో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల 35 నిమిషాలకు జరిగినట్లుగా నాగార్జున తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తాజాగా ఫ్యామిలీకి సంబంధించిన గ్రూపు ఫొటోని కూడా విడుదల చేశారు. ఈ ఫొటోలో నూతన జంటతో పాటు నాగ్ దంపతులు, చైతూ దంపతులు కూడా ఉన్నారు. ఈ పిక్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు