King Nagarjuna: తన కుమారుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) పెళ్లి ఫొటోలను షేర్ చేశారు కింగ్ నాగార్జున. ఇప్పటి వరకు ఈ పెళ్లికి సంబంధించి అధికారికంగా వచ్చిన ఫొటోలివే కావడం విశేషం. మాములుగా సెలబ్రిటీల పెళ్లి అంటే, అందుకు సంబంధించిన పెళ్లి పత్రికో, పెళ్లి టైమ్, వేదిక ఇవన్నీ ముందే తెలిసిపోతాయి. కానీ చివరి వరకు ఇవేవీ తెలియకుండా మెయింటైన్ చేశారు కింగ్ నాగార్జున అండ్ ఫ్యామిలీ. అందుకు కారణం, ఇంతకు ముందు అఖిల్ పెళ్లి అనుకున్నప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అందుకే, అన్నీ సక్రమంగా అయిన తర్వాతే ప్రకటించాలని నాగార్జున ఫిక్స్ అయినట్లు ఉన్నారు. ఉదయం 3.35 నిమిషాలకు పెళ్లి జరిగిందని చెబుతూ.. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా నూతన జంట ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read- Celebrity Engagement: నిర్మాత అజయ్ మైసూర్‌తో నటి నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్
‘‘మా ప్రియమైన కుమారుడు తన ప్రియురాలు జైనాబ్ (Zainab)ను మా ఇంటి వద్ద తెల్లవారు జామున 3 గంటల 35 నిమిషాలకు వివాహం చేసుకున్నాడని తెలియజేయడానికి అమల, నేను ఎంతో సంతోషిస్తున్నాము. ప్రేమ, నవ్వులు, సన్నిహితుల మధ్య మా కల నిజమైంది. వారు మొదలు పెట్టబోతున్న ఈ కొత్త ప్రయాణానికి మీ ఆశీస్సులు కోరుకుంటున్నాము. ప్రేమతో, కృతజ్ఞతలతో మీ నాగార్జున’’ అని కింగ్ నాగార్జున ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. నాగ్ చేసిన ఈ పోస్ట్‌కు అక్కినేని అభిమానులు, నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి తర్వాత అఖిల్ ఫేట్ మారిపోతుందని, ఈ సారి బ్లాక్ బస్టర్ సక్సెస్ పక్కా అనేలా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం నాగ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మరో వైపు ఈ పెళ్లిపై ఉదయం నుంచి ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు, డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతుండటంతో.. టాలీవుడ్‌లో అంతా ఈ పెళ్లి గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ డిస్కషన్స్‌కి తెరదించుతూ.. జూన్ 8 భారీ స్థాయిలో అఖిల్, జైనాబ్‌ల మ్యారేజ్ రిసెప్షన్‌ను నిర్వహించేందుకు కింగ్ నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వేడుకకైనా అక్కినేని అభిమానులకు ఆహ్వానం ఉంటుందేమో చూడాలి. ఈ రిసెప్షన్‌కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ హాజరవుతారని కూడా టాక్ నడుస్తుంది. వారిని కింగ్ నాగ్ ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.
With immense joy, Amala and I are delighted to share that our dear son has married his beloved Zainab in a beautiful ceremony (3:35 am) at our home, where our hearts belong. We watched a dream come true surrounded by love, laughter, and those dearest to us.
We seek your blessings… pic.twitter.com/jiIDnQrVSk— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 6, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు