Single OTT: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కాంబినేషనల్‌లో ఈ సమ్మర్‌కి వచ్చి వినోదాలు పంచిన చిత్రం ‘సింగిల్’. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ (Ketika Sharma), ఇవానా (Ivana) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్రను పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించిన ఈ చిత్రాన్ని కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని, కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మరీ ఇంత సైలెంట్‌గా ఓటీటీలోకి ఈ సినిమాను దింపడానికి కారణం ఏమై ఉంటుందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read- King Nagarjuna: అఖిల్ పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున.. ఏం చెప్పారంటే?
మాములుగా అయితే ఈ సినిమా అంతా తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలవుతుందని అనుకున్నారు. కానీ, అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఒక నెల తర్వాత ఆహాలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లోకి ఈ సినిమా వచ్చిందనే విషయం చాలా మందికి తెలియని కూడా తెలియదు. ఇలాంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని కాస్త ప్రమోట్ చేసుకుని ఓటీటీలోకి వదులుకోవాలిగానీ, ఇంత సైలెంట్‌గా ఎందుకు స్ట్రీమింగ్‌కు తెచ్చారో అర్థం కావడం లేదంటూ శ్రీ విష్ణు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుండటం విశేషం. నిజంగా అప్డేట్ వచ్చి ఉంటే మాత్రం, అమెజాన్‌లో టాప్‌లో ఈ సినిమా ట్రెండ్ అవుతూ ఉండేది. అలా చేయనప్పటికీ ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మంచి ఆదరణనే రాబట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అమెజాన్ టాప్ 5 లిస్ట్‌లోకి వస్తుందని టీమ్ భావిస్తోంది.
Also Read- Bunny Vas: పెద్ద హీరోలనూ ఉద్దేశిస్తూ బన్నీ వాస్ చేసిన పోస్ట్ వైరల్.. ఎంత ధైర్యం?
‘సింగిల్’ కథ విషయానికి వస్తే.. విజయ్ (శ్రీ విష్ణు) ఎస్‌డిఎఫ్ బ్యాంక్‌లో ఇన్స్యురెన్స్ విభాగంలో వర్క్ చేస్తుంటాడు. తన మిత్రుడు, బ్యాంక్‌లో సహోద్యోగి అయిన అరవింద్ (వెన్నెల కిషోర్) ప్రేమకు సాయం చేసే క్రమంలో పూర్వ (కేతిక శర్మ)ను చూసి.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా ఆమెతో లవ్‌లో పడిపోతాడు. పూర్వ ఓ కారు షోరూంలో పని చేస్తుంది. ఆ విషయం తెలుసుకుని, ఆమెను ఎలాగైనా ప్రేమలో పడేయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు విజయ్. దీని కోసం అతను చేసిన ప్లాన్ వర్కవుట్ కాదు. అదే టైమ్‌లో డ్యాన్సర్ హరిణి (ఇవానా) విజయ్‌తో ప్రేమలో పడుతుంది. పూర్వ చుట్టు విజయ్ తిరుగుతుంటే, విజయ్ వెంట హరిణి పడుతుంటుంది. చివరికి ఈ ముక్కోణపు ప్రేమ కథ ఎటు టర్న్ తీసుకుంది? ఫైనల్‌గా ఎవరు ఎవరిని ప్రేమలో పడేశారు? ఫైనల్‌గా ఈ ముక్కోణపు లవ్ స్టోరీకి ఎలా ఎండ్ కార్డ్ పడిందనేది తెలియాలంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ ‘సింగిల్’ సినిమా చూడాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు