CM Revanth Reddy: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు (Cabinet Meeting) నిర్వహించాలని నిర్ణయించింది. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభిప్రాయానికి వచ్చారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా నెలలో రెండుసార్లు కేబినేట్ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.
Also Read: Akhil Zainab Ravdjee Wedding: సైలెంట్‌గా అఖిల్ పెళ్లి.. ఓ రేంజ్‌లో సందడి చేసిన చైతూ.. వీడియోలు వైరల్!
నెలకు రెండు దఫాలుగా కేబినేట్ సమావేశం జరిగితే.. క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాల గురించి మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశముంటుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించేందుకు వీలవుతుందని అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో రెండు వారాలకు ఒకసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. కాగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 17 సార్లు కేబినేట్ భేటీలు జరగడం గమనార్హం.