Minister Sithakka( iMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Minister Sithakka: అమ్మాయిల స్వీయ రక్షణకు.. బాలికా రక్షక టీంలు!

Minister Sithakka: ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు రక్షణ కరువు అవుతుందని, అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీములను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు. రాజేంద్రనగర్ లో నిర్వహిస్తున్న మేధో మథన సదస్సు ముగింపు సభలో గురువారం మంత్రి పాల్గొని మాట్లాడారు. అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలు

చెడుగా ప్రవర్తిస్తే ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలని అంగన్ వాడీలకు సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు అన్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామన్నారు. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Also Read: Bachupally Police: వివాహేతర సంబంధమే.. హత్యకు కారణమా?

మహిళ భద్రత కోసం ప్రతిష్ట విధానాలు

త్వరలో మహిళల హక్కుల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళ భద్రత కోసం ప్రతిష్ట విధానాలను రూపొందిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటై 10ఏళ్లయినా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్ట రూల్స్ ను అడాప్ట్ చేసుకోకపోవడం బాధాకరం అన్నారు. త్వరలో రూల్స్ ను అడాప్ట్ చేసుకుంటామన్నారు. అంగన్వాడి గదుల్లోని దేశ భవిష్యత్తు ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్లను, హాజరును పెంచాలని సూచించారు.

Also Read:Constable Sells Ganja: సీజ్‌ చేసిన గంజాయి అమ్మకం.. సూత్రధారి ఎక్సైజ్‌ కానిస్టేబులే! 

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!