Vishal
ఎంటర్‌టైన్మెంట్

Vishal: శుభమా అని పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!

Vishal: కోలీవుడ్ హీరో విశాల్‌కు సంబంధించి ఈ మధ్య వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆయనపై ఏ విధంగా వార్తలు వచ్చాయో అందరికీ తెలిసిందే. వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ ఇలా చాలా మంది హీరోయిన్ల పేర్లు విశాల్ పెళ్లి విషయంలో వినిపించాయి. ఎట్టకేలకు తను పెళ్లాడబోయేది ఎవరినో రీసెంట్‌గానే విశాల్ రివీల్ చేశారు. నటి ధన్సికతో విశాల్ వివాహం ఆగస్ట్‌లో కానుంది. ఇలాంటి శుభవార్త వచ్చిన వెంటనే విశాల్‌ను మరో బ్యాడ్ న్యూస్ వెంటాడింది. గతంలో విశాల్‌పై నమోదైన కేసు విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చి, ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే..

Also Read- Konda Surekha: మంత్రి కొండా సురేఖకు తీవ్ర అస్వస్థత.. సడన్‌గా ఎందుకిలా?

విశాల్ తన నిర్మాణ సంస్థ అయినటువంటి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (Vishal Film Factory)లో నిర్మించే సినిమా కోసం ‘గోపురం ఫిలిమ్స్’ అధినేత, ఫైనాన్షియర్ జి.ఎన్. అన్బు చెళియన్ వద్ద రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పట్లో ఈ అప్పును లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) సంస్థ వాల్చుకుని, విశాల్ ఆ అప్పు తీర్చే వరకు.. ఆయన బ్యానర్‌లో చేసే సినిమాల హక్కులన్నీ తమకే అధీనమయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. ఆయన నిర్మించిన ఓ సినిమా హక్కులను వేరే సంస్థకి అమ్మినట్లుగా ఆరోపిస్తూ.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో భాగంగా మధ్యలో విశాల్‌ని మందలించిన హైకోర్టు.. తన ఆస్తుల వివరాలను తెలియజేయాలని ఆదేశించగా.. విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించారు. దీనికంటే ముందు వెంటనే రూ. 15 కోట్లు డిపాజిట్ చేసి, ఆస్తుల వివరాలను తెలియాలని చెప్పినా విశాల్ పట్టించుకోలేదు. ఆ తర్వాత కోర్టు సీరియస్ అవడంతో.. తన ఆస్తుల వివరాలను కోర్టుకు తెలియజేశారు.

Also Read- Pawan Kalyan: ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్.. టార్గెట్ ఫిక్స్!

అలా 2022 నుంచి ఈ కేసు నడస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో తుది తీర్పును మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ కేసులో వచ్చిన తుది తీర్పు ఏంటంటే.. విశాల్ తీసుకున్న రూ. 21.29 కోట్లకు 30 శాతం వడ్డీతో పాటు, న్యాయపరమైన ఖర్చులను కలిపి లైకా ప్రొడక్షన్ సంస్థకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో విశాల్ చిక్కుల్లో పడ్డట్లుగానే భావించాలి. ఒకవైపు తమ హీరోకు పెళ్లి అవుతుందనే ఆనందంలో ఉన్న ఫ్యాన్స్‌కి కూడా.. ఈ తీర్పు తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. వాస్తవానికి ఈ మ్యాటర్‌ని ‘గోపురం ఫిలిమ్స్’తోనే తేల్చుకుని ఉంటే బాగుండేది. ఆ సంస్థతో గొడవలు పడి, లైకా చేతులకు చిక్కాడు. లైకా సంస్థ మాములుగా వదిలిపెట్టదనే విషయం ఇప్పటికే శంకర్ విషయంలో నిరూపితమైంది. అన్ని కోట్ల అమౌంట్ విశాల్ దగ్గర ఆగిపోయినా, లైకా పోరాటం చేసేందంటే.. అది ఆ సంస్థ స్టామినా. వేరొకరైతే.. అసలు ఇస్తే చాలని కామ్ అయ్యేవారు. ఇంతగా పోరాడేవారు కాదు. మరి ఈ తీర్పుపై విశాల్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడో తెలియాల్సి ఉంది. విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన ఎప్పుడో నటించిన సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఆ సినిమా విడుదల టైమ్‌లో విశాల్ హెల్త్‌పై ఎలాంటి వార్తలు వచ్చాయో తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం