Actress Nagma
ఎంటర్‌టైన్మెంట్

Nagma: నగ్మా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఆమె లైఫ్‌లోని షాకింగ్ విషయాలు!

Nagma: 90స్‌లో తన అందంతో సినిమా రంగాన్ని, అప్పటి కుర్రకారును అల్లాడించిన నటి నగ్మా. 40 ప్లస్ ఏజ్‌లో కూడా ఇప్పటికీ ఆమె అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ.. గ్లామర్ విషయంలో ఎందరో నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అప్పట్లో బికినీలో కనిపించడానికి, ఎక్స్‌పోజింగ్‌కు సరికొత్త అర్థాన్నిచ్చిన నగ్మా.. కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్‌గా మారింది. ఆమెతో కలిసి నటించిన హీరోలు తాతలు అయ్యారు. ఆమె తోటి నటీమణులు అమ్మమ్మలు, నాయనమ్మలు అయ్యారు. కానీ నగ్మా ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లికి సంబంధించి ఇప్పటికీ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఎందుకు ఆమె పెళ్లి చేసుకోలేదు. అసలు ఆమె జీవితంలో ఏమి జరిగిందనే విషయాలను ఒక్కసారి గమనిస్తే..

నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. 1974, డిసెంబర్ 25న ముంబైలో జన్మించింది. నగ్మా తండ్రి అరవింద్ హిందువు కాగా, తల్లి షమా కజీ ముస్లిం. వీరిద్దరికీ జన్మించిన నందితా అరవింద్ మొరార్జీ.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరును నగ్మాగా మార్చుకుంది. నటి జ్యోతిక, నటి రోషిణి (చిరంజీవి ‘మాస్టర్’ హీరోయిన్) ఆమె చెల్లెళ్లు. కాకపోతే వీరికి తండ్రి వేరు. నగ్మా తల్లి తన భర్త అరవింద్‌కి విడాకులు ఇచ్చిన అనంతరం నిర్మాత అయిన చందర్ సదనాను పెళ్లి చేసుకుంది. షమా కజీ, చందర్ సదనా జంటకు పుట్టిన వాళ్లే జ్యోతిక, రోషిణి. తల్లి ఒక్కరే కానీ, తండ్రులే వేరు. 1990లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘బాఘి: ఎ రెబల్ ఫర్ లవ్’ అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నగ్మా. ఆమె నటించిన తొలి చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో.. మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం నగ్మాకు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలలో ఆమెకు అవకాశాలు వచ్చాయి.

Also Read- Janhvi Kapoor and Nani: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’.. ఇద్దరూ ఏదో మెసేజ్ ఇస్తున్నారే!

చమటలు పట్టించిన గ్లామర్ క్వీన్

బాలీవుడ్‌లో చేస్తూనే దక్షిణాది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది నగ్మా. అప్పటి దక్షిణాది స్టార్ హీరోలందరి సరసన నటించిన నగ్మా.. గ్లామర్ విషయంలో అప్పటి వరకు ఒక లెక్క, ఆమె వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నట్లుగా మార్చేసింది. బికినీలతోనూ అటు హీరోలకు, ఇటు కుర్రాళ్లకు చమటలు పట్టించింది. సౌత్‌లోని భాషలన్నింటిలో సినిమాలు చేసి, సక్సెస్ సాధించిన హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపును తెచ్చుకుంది. రజనీకాంత్‌ (Rajinikanth)తో చేసిన ‘బాషా’, చిరంజీవి (Chiranjeevi)తో చేసిన ‘ఘరానా మొగుడు’, ప్రభుదేవా (Prabhudeva)తో చేసిన ‘ప్రేమికుడు’ నగ్మా ఇమేజ్‌ని అమాంతం పెంచేశాయి. అగ్రతారగా ఆమెకు సింహాసనాన్ని అప్పగించాయి. అలా నటిగా తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న నగ్మా.. మరి ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా?

Nagma

పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!

ఆమె ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ప్రేమలో విఫలం కావడమే. దాదాపు నలుగురైదుగురు పెళ్లైన వారిని ప్రేమించి, నగ్మా ఫెయిలైంది. మొదట క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)తో ఆమె ప్రేమాయణం నడిపినట్లుగా అప్పట్లో వార్తలు దుమారాన్ని రేపాయి. శ్రీకాళహస్తి గుడిలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనేలా టాక్ నడిచింది. అయితే అప్పటికే పెళ్లై ఉన్న గంగూలీకి తన భార్య తరపు నుంచి ఒత్తిడి రావడంతో.. నగ్మాని వదిలేయాల్సి వచ్చిందని అనుకుంటూ ఉంటారు. గంగూలీ తర్వాత ఆమె కోలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న శరత్ కుమార్ (Sarath Kumar) ప్రేమలో పడింది. అప్పటికే పెళ్లయిన శరత్ కుమార్.. నగ్మా కోసం తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. కానీ ఏం జరిగిందో ఏమో.. వారిద్దరికీ పెళ్లి అనుకున్న సమయంలో.. నగ్మాని కాదని రాధికను శరత్ కుమార్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నగ్మా లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రవి కిషన్ (‘రేసుగుర్రం’ విలన్, ప్రస్తుతం ఎంపీ). రవి కిషన్ (Ravi Kishan) తర్వాత భోజ్‌పురి నటుడు మనోజ్ తివారితో ప్రేమ వ్యవహారం నడిచిందనేలా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఎవరితోనూ పెళ్లి వరకు నగ్మా వెళ్లలేదు. ఇక విసిగిపోయిన నగ్మా.. ఇక పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం తీసుకుంది. అందుకే ఇంత వరకు ఆమె పెళ్లి ఊసు ఎత్తలేదు. ఈ మధ్య ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ, అవి ఎంత వరకు వచ్చాయనేది తెలియదు.

Nagma Actress

Also Read- Pottimama: ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ పొట్టిమామ గురించి తెలుసా?

ఫైనల్‌గా పాలిటిక్స్‌లోకి..

ఇలా పలువురితో ప్రేమ విషయంలో విఫలమైన నగ్మా.. ఆ తర్వాత ఆధ్యాత్మికత వైపు అడుగు పెట్టింది. ఆ తర్వాత రాజకీయాల వైపు ఆమె నడిచింది. రాజకీయాలలో మాత్రం ఆమె అంతగా సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి. మరో వైపు మహిళా సమస్యలపై పోరాడేందుకు ఎప్పుడు ఆమె ముందుంటుంది. రీసెంట్‌గా ఆమె లేట్ వయసులో మ్యారేజ్ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందనేలా వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆమె పెళ్లి ఉంటుందని కూడా టాక్ నడిచింది. నగ్మా కూడా ఇటీవల పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించడంతో.. ఎప్పుడెప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కుతుందా? అని ఆమె అభిమానులంతా వేచి చూస్తున్నారు. మరి ఈసారైనా ఆమె పెళ్లి చేసుకుంటుందా? లేదంటే, మళ్లీ మాములు లైఫ్‌నే కోరుకుంటుందా? అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?