Kakani Pujitha Reddy
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Kakani Arrest: అరెస్టుల‌తో అభిమానాన్ని అడ్డుకోలేరు.. పూజిత వార్నింగ్

Kakani Arrest: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) అరెస్టుపై వైసీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారు. ఆయన అరెస్ట్ అక్రమం అని వైసీపీ తిట్టిపోస్తున్నది. ఈ క్రమంలోనే కాకాణి కుమార్తె పూజితా రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మా నాన్న.. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లకు ప్రేమ‌, అభిమానాన్ని అక్రమ కేసులు, అరెస్టుల‌తో అడ్డుకోలేరు. మా పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పిలుపు మేర‌కు బుధవారం స‌ర్వేప‌ల్లిలో వెన్నుపోటు దినం నిర‌స‌న కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామంలోని వాడ వాడల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అరకొరగా పథకాలు అందిస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ప్రజలు నిరసన తెలియజేశారు. జ‌గ‌న్‌ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో పాటు శాంతిభద్రతలు ఎక్కడా క్షీణించకుండా సుపరిపాలనను అందించారు. కూట‌మి ప్రభుత్వంలో రెడ్‌బుక్ రాజ్యమేలుతోంది. ప్రశ్నించిన వారి గొంతు అక్రమ కేసుల‌తో నొక్కే ప్రయ‌త్నం చేస్తున్నారు. అధికారులు పరిధి దాటి ప్రజలపై నియంతలా ప్రవర్తిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ప్రజలపై ఒక నియంతలా వ్యవహరిస్తున్నది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. నాయకులు, ప్రజా సమస్యల గురించి మాట్లాడకూడదనే విధంగా వీరి వ్యవహారం ఉంది అని పూజిత మండిపడ్డారు.

Read Also- Seemaraja: సీమరాజా ఓవరాక్షన్.. ఏమిటీ గంజాయి వ్యవహారం?

మాకు నాయకుడే కాదు..
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు అంతే ఉత్సాహంతో నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో పత్రికలకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రథమం. నాన్న కాకాణి గోవ‌ర్ధన్‌రెడ్డిని జైల్లో పెట్టినా, కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురిచేసినా, కేసులు పెడతామని భయపెట్టినా, వాటన్నింటిని దాటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. అరెస్టులతో అక్రమ‌ కేసులతో నాన్నపై సర్వేపల్లి ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరు. నిరసన కార్యక్రమంలో అధికారులు మమ్మల్ని అడుగడుగున అడ్డుకున్నా, మాకు రక్షణగా సర్వేపల్లి ప్రజలు నిలబడ్డారు. కాకాణి.. మాకు నాయకుడు మాత్రమే కాదు మార్గదర్శి కూడా. ఆయ‌న కుమార్తె నిర‌స‌న కార్యక్రమం చేపట్టలేదని అవహేళనతో అడ్డంకులు సృష్టించినా వారందరికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం చెంపపెట్టు. మేం చేప‌ట్టిన కార్యక్రమంలో ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి పాల్గొని మా అందరిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపారు. మా కుటుంబానికి మెండుగా సర్వేపల్లి ప్రజల అభిమానం, ప్రేమ ఉందని గమనించాలి. ప్రభుత్వ పెద్దలు ఇకనైనా క‌క్షసాధింపు చ‌ర్యల‌కు స్వస్తి పలికి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి అని పూజిత హితవు పలికారు. కాగా, ఈ నిరసన కార్యక్రమం విజయవంతం చేసిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, సర్వేపల్లి ప్రజలకు పూజితారెడ్డి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Read Also- ISI Network Exposed: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఐఎస్ఐ గుట్టురట్టు

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు