cm revanth reddy with gulf workers
Politics

Gulf Workers: కాంగ్రెస్ ‘గల్ఫ్’గోల్.. వెల్ఫేర్ బోర్డు, బీమాకు సీఎం హామీ

  • గల్ఫ్‌‌ కార్మికులను గాలికొదిలేసిన కేసీఆర్ సర్కారు
  • ఏనాడూ వారి ఊసెత్తని కమలం పార్టీ
  • మూడు సీట్లలో గల్ఫ్ బాధితుల ప్రభావం
  • వెల్ఫేర్‌‌ బోర్డు, బీమాకు సీఎం రేవంత్‌‌ హామీ
  • సెప్టెంబర్ 17 లోగా సమస్యల పరిష్కారానికి రేవంత్ హామీ
  • తమకే కలిసొస్తుందని కాంగ్రెస్‌‌ లీడర్ల ఆశ

హైదరాబాద్, స్వేచ్ఛ: లోక్‌సభ ఎన్నికల వేళ గల్ఫ్‌‌ కార్మికులు ఎక్కువగా ఉండే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలలో వారి కుటుంబాల ప్రభావం పడనుంది. దీంతో గల్ఫ్‌‌ కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన పార్టీలన్నీ విశ్వప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ వర్గాల ఆవేదన.. అరణ్య రోదనే అయింది. ఇక తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఏనాడూ గల్ఫ్ కార్మికుల పక్షాన పోరాడలేదు. కనీసం వాళ్లు అక్కడ ఎలా జీవిస్తున్నారో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ రెండు పార్టీలపై అసంతృప్తితో ఉన్న కార్మికులను ఈ ఎన్నికల్లో తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌‌ నేతలు ప్లాన్‌‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా గల్ఫ్‌‌ బాధితులకు నష్ట పరిహారాలు చెల్లిస్తూ దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు.

15 లక్షల కార్మికులు
భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం, సుమారు 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో ఉండగా, వీరిలో ఉత్తర తెలంగాణ వారి సంఖ్య 10 లక్షలు. వీళ్ల కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే సుమారు కోటికి పైగానే వీరి ఓట్లు ఉంటాయి. కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 8 నుంచి 12 శాతం వీరి ఓటు బ్యాంకు ఉంది. గల్ఫ్‌‌ జేఏసీ నేతలు నిర్వహించిన సర్వేలో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పార్లమెంట్‌‌ పరిధిలో గల్ఫ్ ఓటు ప్రభావితం చేసే ప్రాంతాలను అసెంబ్లీ నియోజకర్గాల వారీగా ఏ-1, ఏ-2 కేటగిరిలుగా గుర్తించారు.

Also Read: ఇండియాకు రాకుండా చైనాకు చెక్కేసిన ఎలన్ మస్క్

వంచించిన బీఆర్ఎస్
2008 ఏప్రిల్ 27న సికింద్రాబాద్‌‌లో నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ ఏడో ప్లీనరీలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక సెల్ ఏర్పాటుతో బాటు రూ. 500 కోట్లు కేటాయించాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్‌‌ డిమాండ్‌‌ చేశారు. గల్ఫ్‌‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌‌గ్రేషియా, ఎన్‌‌ఆర్‌‌ఐ పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశం, గల్ఫ్‌‌లో చనిపోయిన వారి మృతదేహాలను తెప్పించేందుకు మానిటరింగ్‌‌ సెల్‌‌ ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నిటినీ 2014 నాటి తన పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చినా, వాటిలో ఒక్క హామీనీ నెరవేర్చలేదు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 24 గల్ఫ్‌‌ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉత్తర తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో ఇక్కడ బీఆర్ఎస్ కుదేలైపోయింది.

కాంగ్రెస్ వైపే మొగ్గు
కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం పోటీ అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్యేనే ఉంది. గల్ఫ్‌‌లో చనిపోయిన కార్మికుల ఫ్యామిలీలకు రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో కాంగ్రెస్‌‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎక్స్‌‌గ్రేషియా చెల్లింపును వేములవాడలో చేపట్టడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ఇచ్చే జీవో విడుదలపై కసరత్తు చేయాలని సీఎం సెక్రటరీ షానవాజ్‌‌ ఖాసీంకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కార్మికుల సంక్షేమానికి కేరళ తరహా వెల్ఫేర్‌‌ బోర్డుకు సైతం హామీ ఇవ్వడంతో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు తమకు పడుతాయని ఆ పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?