Dogs Attack (imagcredit:swetcha)
తెలంగాణ

Dogs Attack: నాటు కోళ్ల షెడ్డుపై శునకాల దాడి!

Dogs Attack: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. నాటు కోళ్లు పెంచుతున్న షెడ్డుపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చెయ్యడంతో 300 నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి,రంగాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే రైతు జీవనోపాధి కోసం షెడ్డు ఏర్పాటు చేసుకొని పెంచుకున్నాడు. కోళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో నాటుకోళ్ల పెంచుతున్నాడు, రాత్రి షెడ్డులోకి కొన్ని కుక్కలు ప్రవేశించి కోళ్లపై దాడి చేసి కొరికి చంపాయి, మల్తేష్ ఉదయం షెడ్డుకి వెళ్లిన యజమాని చనిపోయిన కోళ్లను చూసి షాక్ అయ్యాడు. దీంతో ఆవేదనకు గురై షెడ్డులో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పరిశీలించగా కుక్కలు దాడి వళ్ళ కోళ్లు చనిపోయినట్లు నిర్దారించుకున్నాడు, చనిపోయన కోళ్లు దాదాపు 2 లక్షలు నష్టం వాటిల్లినట్లు యజమాని మల్లేష్ తెలిపాడు.

Also Read: Magam Rangareddy Passes Away: బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత అకస్మిక మృతి.. కారణాలివే!

గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా‌లో

గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంతంలో నాటు కోళ్ళఫామ్ పై శునకాలు దాడి చేశాయి. ఆ ఫామ్ లో సుమారు 200 కోళ్ళను శునకాలు దాడి చేసి చంపివేశాయి. గుంపులుగా వచ్చిన శునకాలు ఒక్కసారిగా దాడి చేయడంతో మిగతా కోళ్లు చెల్లా చెదురు అయ్యాయి. దీంతో సుమారు రూ.1లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని బాధితుడు బైరి సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా పట్టణంలో శునకాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశాడు. ఒక వైపు మనుషులపై దాడి చేస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనీ, తాము ఎన్నో సార్లు పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని భాదితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో శునకాల బెడదకు నివారణ చర్యలు చేపట్టకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని వారు గతంలో తెలిపారు.

Also Read: Census 2027 Schedule: జనాభా లెక్కలకు ముహూర్తం ఫిక్స్!

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!