AP Cabinet
Politics, ఆంధ్రప్రదేశ్

Chandrababu: ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. ఆ మంత్రులపై చంద్రబాబు తీవ్ర అసహనం!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో కొందరు మంత్రులపై (AP Ministers) ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనే విషయం ఎన్నో రోజులుగా ఉన్నది. అయితే ఎన్నిసార్లు చెప్పినా, వారిలో కనీసం ఇసుమంత కూడా మార్పు రాకపోవడంతో సీఎం తీవ్ర అసహనంతో ఉన్నారన్నది జగమెరిగిన సత్యమే. ఈ మంత్రులకు ఇప్పటికే పలుమార్లు వ్యక్తిగతంగా, ఫోన్‌లో క్లాస్ తీసుకున్నారు కూడా. అయితే ఏడాది పూర్తి కావొస్తున్న సందర్భంగా బుధవారం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ (AP Cabinet) సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో కూడా మరోసారి ఆయా మంత్రులపై సీఎం అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ‘ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? ఇక మీరు మారరా? మీలో మార్పు అంటూ ఉండదా.. రాదా?’ అంటూ కన్నెర్రజేసినట్లుగా తెలిసింది. బాబు మాట్లాడుతున్నంత సేపు ఆ మంత్రులు సైలెంట్‌గా ఉండటంతో ‘ మౌనంగా ఉంటే అర్థమేంటి? ఇలాగే ఉంటారా? చూస్తుండగానే ఏడాది పూర్తయ్యింది.. మీకు అర్థమవుతోందా?’ అని ఆగ్రహం, అసహనంతో మాట్లాడినట్లుగా సమాచారం. క్యాబినెట్‌లో భేటీ పూర్తయ్యాక ఆయా మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకొని, ఇదే ఆఖరి ఛాన్స్ అని క్లియర్‌ కట్‌గా తేల్చి చెప్పారని సమాచారం. అంతేకాదు.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినా, ఈసారి ఎలాంటి మార్పు రాకపోయినా ఏమాత్రం మొహమాటం లేకుండా కేబినెట్‌లో నుంచి పీకేస్తానని తేల్చి చెప్పేశారట. దీంతో కేబినెట్‌ సమావేశంలో కాసేపు అందరూ ముక్కున వేలేసుకున్నారట.

AP Cabinet Meeting

జగన్ గురించి పరోక్షంగా..
వైసీపీ నిర్వహిస్తున్న ‘వెన్నుపోటు దినం’పై క్యాబినెట్‌లో గట్టిగానే చర్చ జరిగినట్లు తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ఒకటికి రెండుసార్లు మంత్రులతో చంద్రబాబు చెప్పడమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు నేరస్థుల్ని రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేవారని, ఇప్పుడు నేరస్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నేరస్థులకు తాము అండగా ఉన్నామని ప్రజలకు సందేశమిస్తూ, రాజకీయాల్ని ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదని వైఎస్ జగన్ పేరు ఎత్తకుండానే భేటీలో ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. కూటమి ఏడాది పరిపాలన అంతా బాగుందని, ఇకపై మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని కీలక సూచనలు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండా కావాలని.. మరింత దూకుడుగా ప్రజల్లో మమేకం కావాలని మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం ఏమాత్రం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ఏ తప్పూ చేయకుండానే టీడీపీ నేతలను జైలుకు పంపారనే విషయాలను ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. ఇందుకు బాబు స్పందిస్తూ.. నేరం రుజువైతే ఎంతటివారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు.

Read Also- Bunny Vas: గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు విడిపోయాడా? కొత్త బ్యానర్‌లో చేస్తున్న సినిమా డిటైల్స్ ఇవే..!

క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
క్యాబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడించారు.
01. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ:
ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం, ఆదివాసీ ప్రాంతాలకు ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం రూ.575.75 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు మరియు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 533 నీటి కొరత ఉన్న జనావాసాల్లో కవరేజీ కోసం క్లస్టర్ ఆధారిత విధానంలో 15 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు రూ.822.86 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఈ నిర్ణయం వల్ల శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపుకొట్టూరు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, మందస తదితర ఏడు మండలాల్లో సీతంపేట మండలంలోని ఆదివాసీ ప్రాంతాలతో సహా 341 జనావాసాల్లోని 2.42 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది. అలాగే చిత్తూరు జిల్లా కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని 533 జనావాసాల్లోని 2.85 లక్షల మంది ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుంది.

02. హోం శాఖ:
2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావజ్జీవ ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్న 17 మంది ఖైదీలను అర్హులుగా బావించి ప్రత్యేక క్షమాబిక్షను మంజూరు చేసేందుకై హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఏపీఎస్పీఎఫ్ (APSPF)లో 248 కానిస్టేబుల్లను హెడ్ కానిస్టేబుల్లుగా పదోన్నతి ఇవ్వడానికి, కానిస్టేబుళ్ల సంఖ్యను 248కి తగ్గించడానికి హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.

Chandrababu

03. రెవెన్యూ (ల్యాండ్స్):
వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ (G.O.Ms.No.170, Rev (Lands.IV) Dept., Dt:26.05.2025) ను దృవీకరించేందుకు రెవిన్యూ (ల్యాండ్స్) శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఏలూరు జిల్లా, అగిరిపల్లి మండలం, పిన్నమరెడ్డి పల్లి గ్రామంలోని మరియు నూగొండపల్లి గ్రామంలోని మొత్తం 94.497 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక అధికారుల నుంచి ఎన్‌వోసీ (NOC) తీసుకొని హోం శాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవిన్యూ (ల్యాండ్స్) శాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది.

Read Also- Pawan Kalyan: లోకేష్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. కళ్ళకు కట్టినట్లుగా!

04. బీమా వైద్య సేవల శాఖ:
కార్మిక రంగ సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధివిదానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై, పరిశ్రమల చట్టం-1948 లోని 54, 55, 56, 59, 64, 65, 66వ సెక్షన్లలోని కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు, 2025 ద్వారా సవరించేందుకు కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు.. బీమా వైద్య సేవల శాఖ (LFB & IMS) చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర పడింది. కార్మిక రంగ సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధివిదానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై, ఏ.పీ. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం, 1988 లోని 9,10,16,17,73 సెక్షన్లలోని కొన్ని నిబంధనలను ఏ.పీ. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సవరణ బిల్లు, 2025 ద్వారా సవరించేందుకు కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు.. బీమా వైద్య సేవల శాఖ ( LFB & IMS) చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

05. యువత అభివృద్ధి, పర్యాటకం సాంస్కృతిక శాఖ:
విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రీనివాస్ ఆధునీకరణకు చేపట్టిన పనులకు ఇప్పటికే సవరించి అమలు పర్చిన పరిపాలనా అనుమతులను దృవీకరించేందుకు యువత అభివృద్ధి, పర్యాటకం సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటం మిషన్ స్థాపనకు.. ఐటీ, ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

06. మరికొన్ని నిర్ణయాలు ఇలా..
సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు.. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు కానుంది. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు, రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APEDCO) ద్వారా ఎన్టీఆర్ జిల్లా, వేమవరం గ్రామంలోని జెట్ సిటీ (JETCITY) వద్ద ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర పరిశ్రమలు.. మౌలిక సదుపాయాల శాఖ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also- Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు